మకరజ్యోతి దర్శనం.. పరవశించిన అయ్యప్ప భక్తులు

swamyమకర సంక్రాంతి పర్వదినాన శబరిమలలో అయ్యప్ప భక్తులకు మకరజ్యోతి దర్శనం కలిగింది. దీంతో శబరిమల కొండ అయ్యప్ప శరణు ఘోషతో మార్మోగింది. ‘‘స్వామియే శరణం అయ్యప్ప’’ అంటూ భక్తులు పరవశించిపోయారు. మూడుసార్లు దర్శనమిచ్చిన జ్యోతి స్వరూపాన్ని కన్నులనిండుగా దర్శించుకున్నారు. గుండెల నిండుగా స్వామి వారిని తలుచుకున్నారు. ఏటా సంక్రాంతి పర్వదినాన శబరిమల కొండపై అయ్యప్పస్వామి మకరజ్యోతి స్వరూపుడై తన భక్తులకు దర్శనమిస్తున్నారు. సుమారు 15 లక్షల మంది భక్తులు జ్యోతి దర్శనం చేసుకున్నారు.

పంపానది తీరాన ఎక్కడ చూసినా స్వాముల సందడి కనిపించింది. పందళరాజ్యం నుంచి తెచ్చిన ఆభరణాలను స్వామికి అలంకరించిన తర్వాత… అయ్యప్పకు హారతి ఇచ్చారు పూజారులు. తర్వాత పొన్నాంబళంమేడు కొండపై జ్యోతి స్వరూపం దర్శనమిచ్చింది.

మకర సంక్రమనం రోజున శభరిగిరులపై కనిపించే జ్యోతి దర్శనం కోసం భక్తులు భారీగా పోటెత్తారు. పరమ పవిత్ర పంపాతీరం అయ్యప్ప భక్తులతో నిండిపోయింది. పులిమేడు, పాంచాలివేడు, సన్నిధానం ప్రాంతాలు స్వామియే శరణమయ్యప్ప నామస్మరణతో మిన్నంటాయి.

చిమ్మ చీకట్లో అయ్యప్పస్వామి.. మకర జ్యోతి రూపంలో మూడుసార్లు భక్తులకు దర్శనమిచ్చాడు. మకర జ్యోతిని దర్శించుకున్న భక్తులు ‘స్వామియే శరణం అయ్యప్ప’ అంటూ హోరెత్తించారు. ఎన్నో నియమనిష్టలతో అయ్యప్ప దీక్ష చేపట్టి.. స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు.. జ్యోతి దర్శనంతో పులకించిపోయారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy