మక్కా మసీదుకి పునాది పడి 400 ఏళ్లు

Mecca-Masjid-68352అదో ప్రార్థనామందిరం… ముస్లింల పవిత్ర స్థలం.. హైదరాబాద్ కు తరలివచ్చిన మక్కా పుణ్యక్షేత్రం.. చార్మినార్ కు కూతవేటు దూరంలో నిర్మాణమైన అద్భుతం కట్టడం ఇది.  చారిత్రకంగానే కాకుండా… నిర్మాణాత్మకంగా ప్రత్యేకతను చాటుకుంటోంది మక్కా మసీదు. ఆ నిర్మాణానికి శంకుస్థాపన జరిగి నేటితో 400 ఏళ్లు పూర్తయ్యాయి. ముగ్గురు రాజులు కాలంలో… నిరంతరం సాగి… చివరికి మొగల్ సామ్రాజ్య నేత ఔరంగ జేబు కాలంలో నిర్మాణం ముగియడం విశేషం.

మక్కా మసీద్.. భారతదేశంలోని ప్రాచీమైన అతిపెద్ద మసీద్ లలో ఒకటి. 1617లో మహ్మద్ కులీ కుతుబ్ షా అల్లుడు మహమ్మద్ కుతుబ్ షా ఈ మసీదుకు పునాది రాయి వేశాడు. అయితే మరో ఇద్దరు రాజులు గోల్కొండ సింహాసనం అధిష్టించే వరకు ఈ నిర్మాణం పూర్తి కాలేదు. అబ్దుల్లా కులీ కుతుబ్ షా, తానేషా కాలంలోనూ దీని నిర్మాణం కొనసాగింది. మొగల్ దాడుల వల్లే నిర్మాణం ఆలస్యమైంది. 1694లో మొఘల్ చక్రవర్తియైన ఔరంగజేబు ఈ నిర్మాణాన్ని పూర్తి చేశాడు. దీని నిర్మాణం కోసం 8000 మంది కూలీలు పనిచేశారు. చార్మినార్ నిర్మాణానికి 30 ఏళ్లు పడితే.. మక్కా మసీదుకి  77 ఏళ్లు పట్టింది. మరో విశేషం ఏంటంటే.. నిర్మాణంలో రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాల వాసులు పని చేశారు. దీని నిర్మాణానికి షాద్ నగర్ లోని ఒకే కొండ రాళ్లను వినియోగించారు.

చార్మినారుకు నైరుతి దిశలో 100గజాల దూరంలోవున్న ఈ మసీద్ నిర్మాణం కోసం మక్కా నుంచి ఇటుకలు తెప్పించారు.  వీటిని మధ్య ఆర్చీలో ఉపయోగించారనీ, అందుకే దీని పేరు మక్కా మసీదుగా స్థిరపడిందని అంటారు. దీని హాలు 75 అడుగుల ఎత్తు, 220 అడుగుల వెడల్పూ, 180 అడుగుల పొడవూ కలిగి ఉంది. 3వేల మంది ఒకేసారి ఈ హాలులో ప్రార్థన చేసుకోవచ్చు. ఈ మసీదులో మహమ్మద్ ప్రవక్త  “పవిత్ర కేశం” భద్రపరిచారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy