మక్కా లో అతి పెద్ద హోటల్..!

hotelఖర్చు: 22 వేల కోట్లకు పైనే

పేరు : అబ్రాజ్ కుదాయ్

రూమ్స్ :10,000

రెస్టారెంట్లు: 70

ముస్లింల పవిత్ర నగరం మక్కా మరో రికార్డుకు సిద్ధమవుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద హోటల్ నిర్మాణానికి వేదిక కాబోతుంది.. అబ్రాజ్ కుదాయ్ పేరుతో విలాసవంతమైన హోటల్ ను నిర్మించనున్నారు. ప్రపంచదేశాల నుంచి మక్కాకు వచ్చే ముస్లింల వసతి కోసం ఈ హోటల్ నిర్మిస్తున్నారు. ఈ హోటల్ కు అక్షరలా రూ. 22వేల 375 కోట్లు ఖర్చు కానుంది. అబ్రాజ్ కుదాయ్..నిర్మాణం పూర్తైతే వాల్డ్ బిగ్గెస్ట్ హోటల్ ఇదే. ఈ భారీ హోటల్ కు దార్ అల్ హండ్సా గ్రూప్ డిజైన్ రూపొందించింది. పది వేల గదులు, 70 రెస్టారెంట్లు, అరడజను హెలీఫ్యాడ్లతో ప్రపంచంలోనే అతిపెద్ద హోటల్ నిర్మాణానికి సిద్ధమవుతోంది. ఒక్కో టవర్ లో 44 ఫ్లోర్స్ లెక్కన 12 టవర్లు నిర్మించనున్నారు. ఈ హోటల్లోని 10 టవర్లలో ఫోర్ స్టార్ లగ్జరీ, 2 టవర్లలో ఫైవ్ స్టార్ లగ్జరీ ఫెసిలిటీస్ అందుబాటులో ఉంటాయి. 46 లక్షల స్వైర్ యాడ్స్ విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ హోటల్ కు అక్షరాలా రూ. 22వేల 375 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ లగ్జరీ హోటల్ కు సౌదీ ఆర్థిక శాఖ నిధులు సమకూరుస్తోంది. ఈ హోటల్ నిర్మాణం 2017లో పూర్తికానుంది.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy