మట్టి గణపతికి జై.. GHMC స్టాల్స్ రెడీ

eco-friendly-ganesh

పోయిన ఏడాదితో పోలిస్తే రాను రాను మట్టివినాయకులకు డిమాండ్ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో పర్యావరణ హిత విగ్రహాలను ప్రోత్సహించేందుకు కాలుష్య నియంత్రణ మండలి(PCB) గ్రేటర్ హైదరాబాద్‌లోని 14 ప్రాంతాల్లో మట్టి వినాయక విగ్రహాలను అందుబాటులో ఉంచనున్నది. ఈ ప్రాంతాల్లో స్టాళ్లను ఏర్పాటు చేసి విగ్రహాలను విక్రయించనున్నది. గురువారం (ఆగస్టు-17) మాదాపూర్‌లోని శిల్పారామం వద్ద తొలిస్టాల్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ స్టాల్‌ను పర్యావరణ, అటవీ, బీసీ సంక్షేమశాఖల మంత్రి జోగు రామన్న ప్రారంభించనున్నారు. మొత్తం 14 స్టాళ్లలో ఇప్పటి వరకు 11 ప్రాంతాలను గుర్తించగా, మిగిలిన మూడు స్టాళ్ల ఏర్పాటుపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ స్టాళ్లను నగరంలోని కోఠి మహిళా కాలేజీ ఎదుట, వైఎంసీఏ గణేశ్ టెంపుల్-మారేడ్‌పల్లి, మెహదీపట్నం రైతుబజార్, అమీర్‌పేట సత్యంథియేటర్, జీడిమెట్ల సుభాష్‌నగర్ బస్టాప్, మల్కాజిగిరి గౌతంనగర్, ఉప్పల్ రింగ్‌రోడ్, మల్లాపూర్ మాణిక్‌చంద్ చౌరస్తా, సనత్‌నగర్ పీసీబీ కార్యాలయం, ఎర్రగడ్డ రైతుబజార్, మాదాపూర్‌లోని శిల్పారామం వద్ద ఏర్పాటు చేయనున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy