మతసామరస్యం అంటే ఇదే : మేం హిందూవులం.. మా పాప పేరు యూనస్

equality2015లో భారీ వరదలతో చెన్నై నగరం అతలాకుతలమైంది.  ఈ నగరంలోని ఉరప్పాకం ప్రాంతంలో మోహన్, అతడి భార్య చిత్ర వరదల్లో చిక్కుకున్నారు. అప్పటికే ఆ ప్రాంతానికి తన మిత్రబృందంతో ఓ పడవ వేసుకొని వచ్చిన యూనస్ అనే ముస్లీం యువకుడు వీరిద్దరినీ చూసి ప్రాణాలకు తెగించి వారిని సురక్షిత ప్రాంతానికి తరలించాడు. ఆ సమయంలో చిత్ర నిండు గర్భిణి. వరద తీవ్ర స్థాయిలో ఉంది. చుట్టుపక్కల ఏ ప్రాంతంలోనూ కరెంట్‌ లేదు. నాలుగు గంటల పాటు కష్టపడి మోహన్‌తో కలిసి పెరుంగలతూర్‌లోని ఓ ఆసుపత్రిలో చిత్రను చేర్పించాడు యూనస్‌.

ఆసుపత్రిలో రెండు రోజులపాటు ప్రాణాలతో కొట్టుమిట్టాడిన ఆమె, చివరకు ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తమ ప్రాణాలను కాపాడిన యూనస్‌కు కృతజ్ఞతగా తమ బిడ్డకు యూనస్‌ అన్న పేరు పెట్టుకున్నారు చిత్ర–మోహన్‌ దంపతులు. ఒక మనిషికి సాయం చేయాలన్న ఆలోచనే ఎప్పుడూ మనల్ని ముందుకు తీసుకెళుతుంది అంటూ యూనస్‌ చెప్పిన మాటను చిత్ర దంపతులు ఇప్పటికీ మరచిపోలేదు. మనిషికి సాయం చేయాలన్న యూనస్‌ ఆలోచన ఎప్పటికీ వర్ధిల్లుతూనే ఉంటుంది. భాయ్‌.. తుఝే సలామ్‌!

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy