మత్తడిపోస్తున్న లక్నవరం చెరువు

laknavaramకాకతీయుల కాలంనాటి పురాతనమైన లక్నవరం చెరువు గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పూర్తిగా నిండి మత్తడిపోస్తోంది. వరంగల్ జిల్లా గోవిందరావుపేట మండలంలోని ఈ లక్నవరం చెరువు సుమారు 12 వేల ఎకరాలకు సాగునీరందిస్తున్నది.ఈ చెరువు నీటి నిల్వసామర్థ్యం 33.6 అడుగులు కాగా,పూర్తిగా నిండింది. లక్నవరం చెరువు మత్తడిపోస్తుండడంతో మండల ప్రజలతోపాటు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు మత్తడి అందాలను తిలకిస్తున్నారు.ఈ చెరువు పూర్తిస్థాయిలో నిండడంతో ఈ ఆయకట్టు ప్రాంత రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy