మత్తు ఇచ్చి అభ్యంతరకర చిత్రాలు తీశారు : BJP ఎంపీ

KC-Patel_MPఓ మహిళ తనను రూ. 5కోట్లు ఇవ్వాలని… లేదంటే రేప్‌ కేసు పెడతానని బ్లాక్ మెయిల్ చేస్తోందని బీజేపీ ఎంపీ  ఆరోపించారు. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. అయితే ఆ మహిళ సుప్రీంకోర్టులో లాయర్ గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.

గుజరాత్‌లోని వల్సాద్‌ నియోజకవర్గ ఎంపీ కేసీ పటేల్‌ తనపై అత్యాచారం చేశాడని ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. అయితే దీనిపై స్పందించిన పటేల్‌.. మహిళ ఆరోపణలను ఖండించారు. సదరు మహిళ ఓ గ్యాంగ్‌ను నడుపుతోందని, డబ్బు కోసమే ఆమె తనను ఇరికిస్తుందని ఎంపీ పటేల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాయం కావాలంటూ ఆ మహిళ తన దగ్గరకు వచ్చిందని.. ఈ క్రమంలో స్నేహం పెంచుకుందని పటేల్‌ చెప్పారు. ఒకరోజు ఆమె ఘజియాబాద్‌లోని తన ఇంటికి ఆహ్వానించిందని, అక్కడ డ్రగ్స్‌ కలిపిన డ్రింక్స్‌ ఇచ్చినట్లు ఎంపీ చెబుతున్నారు. ఆ తర్వాత అభ్యంతరంగా ఫొటోలు, వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపించారు.

దీంతో పోలీసులు ఆ మహిళపై కేసు నమోదు చేశారు. సదరు మహిళ ఓ గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకుని ఉన్నత వర్గానికి చెందిన వారిని బ్లాక్‌మెయిల్‌ చేస్తోందని పోలీసులు గుర్తించారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy