మత్తు మజాలో నగర యూత్..!

Rave party_0ఇప్పటివరకూ మెట్రో పాలిటన్ సిటీస్ కే పరిమితమైన రేవ్ పార్టీ కల్చర్ మెల్లగా హైదరాబాద్  లోనూ విస్తరిస్తోంది. సిటీలో టైట్ సెక్యూరిటీ ఉండటంతో … శివార్లలోని రిసార్టులు, ఫామ్ హౌస్ లు రేవ్ పార్టీలకు అడ్డాగామారాయి. వీకెండ్ వచ్చిందంటే చాలు  డిఫరెంట్ ఎంజాయ్ కోసం  పరుగులు పెడుతోంది యూత్. పోలీసుల నిఘా లేకపోవడంతో సీక్రెట్ గా రేవ్ పార్టీలు నడుస్తున్నాయి. మొన్న మేడ్చల్ పరిధిని మురారి పల్లెలోని హనీబర్గ్ రిసార్ట్  లో రేవ్ పార్టీ పై దాడి సంఘటన మరువకముందే రంగారెడ్డి జిల్లా శామీర్ పేటలోని లియోనియో రిసార్ట్స్ పై ఎస్ వోటీ పోలీసులు అర్థరాత్రి దాడి చేశారు. అర్థనగ్నంగా డ్యాన్స్ చేస్తున్న 23 మంది విదేశీ యువతి, యువకులను అరెస్ట్ చేశారు. వారిపై  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడినవాళ్లంతా సొమాలియా, మంగోలియాకు చెందిన  వాళ్లుగా గుర్తించారు పోలీసులు.

దమ్ము పీల్చడం, మందు కొట్టడం, డ్రగ్స్, అమ్మాయిలతో ఎంజాయ్ చేయడం .. ఇదీ రేవ్ పార్టీల్లో స్పెషల్. దీంతో యూత్ ఎట్రాక్ట్ అవుతోంది. డిఫరంట్ ఆఫర్లతో వీకెండ్ కో చోట రేవ్ పార్టీని అరెంజ్ చేస్తున్నారు బ్రోకర్లు. యువత బలహీనతలను క్యాష్ చేసుకుంటున్నారు. రాత్రి 10 నుంచి తెల్లవారుజాము వరకూ సాగే రేవ్ పార్టీల్లో డ్రగ్స్  సేవించడంతో పాటు ముంబై, ఢిల్లీ, కోల్ కతాల నుంచి యువతులను తీసుకొచ్చి అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారు.  రేవ్  పార్టీలపై అప్పుడప్పుడూ పోలీసులు దాడులు చేస్తున్నా.. ఇవి నామమాత్రమే నన్న ఆరోపణలున్నాయి. గతంలో హయత్  నగర్  రిసార్ట్ పై పోలీసులు రైడ్ చేసి,  యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నారు.  ఆ తర్వాత పెద్దల ఒత్తిడితో కేసు నీరుగారిందన్న విమర్శలువచ్చాయి. ఇప్పటికీ నగర శివార్లలో పెద్ద ఎత్తున వ్యభిచారం..ముజ్రా.. రేవ్  పార్టీలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినపుడే దాడులు జరుగుతున్నాయంటున్నారు జనం. నగర శివార్లలో ప్రతి వీకెండ్  లో ఎక్కడో ఓ చోట రేవ్  పార్టీలు జరుగుతున్నా.. కొన్ని మాత్రమే బయటపడుతున్నాయి. రిసార్టులు, ఫామ్ హౌస్ లపై  పోలీసులు ప్రత్యేక నిఘా పెడితే  ఈ వల్గర్ కల్చర్ కు చెక్ పెట్టవచ్చన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy