మత్తెక్కిస్తున్న ప్రియాంక మూవీ పోస్టర్

baywatch-priyaప్రియాంక చోప్రా అప్ కమింగ్ మూవీ బేవాచ్ పోస్టర్ అదిరిపోయింది. ఈ మూవీ పోస్టర్ చూసిన వాళ్లంతా తమ కళ్లు తిప్పుకోలేకపోతున్నారు. హాలివుడ్ స్టార్స్ నటించిన ఈ బేవాచ్ మూవీని మే 25న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర వర్గాలు. అంతకు ముందే ఒక పోస్టర్ తో కుర్రాళ్లను పిచ్చెక్కిస్తోంది ఈ బాలీవుడ్ ముద్ధుగుమ్మ.

ఈ చిత్ర యూనిట్ వినూత్న ప్రయోగం చేసింది. క్రేజీ లుక్స్ తో ఓ ర్యావిషింగ్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇది ఆడియన్స్ ని ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది. సేత్ గోర్డాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ  ప్రియాంక చోప్రా హాట్ గ్లాసెస్ తో మత్తెక్కిస్తోంది. ఈ రొమాంటిక్ పోస్టర్ పై గో ఏహెడ్ అండ్ స్టేర్ అని రాసి ఉంది.

బుల్లి తెర ప్రేక్షకుల్ని అలరించిన బేవాచ్‌ టీవీ సిరీస్‌ ఆధారంగా.. అదే పేరుతో ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఇందులో డ్వేన్ జాన్సన్, జాక్ ఎఫ్రాన్, కెల్లీ రోహ్రబాక్, అలెజాండ్ర దాద్రిరియో వంటి హాలీవుడ్ స్టార్స్ నటిస్తున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy