మత విశ్వాసాన్ని పక్కన పెట్టి బాలుడిని రక్షించాడు..!!

sikkuమత ధర్మం కన్నా.. మానవత్వం గొప్పదని నిరూపించాడు ఓ సిక్కు యువకుడు. ఆపదలో ఉన్న ఓ బాలుడిని రక్షించి మనిషిగా ప్రవర్తించాడు. మత ధర్మాన్ని పక్కనపెట్టి చిన్నారి ప్రాణాలను కాపాడి ఆదర్శంగా నిలిచాడు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలుడిని కాపాడి మానవత్వాన్ని చాటిచెప్పాడు. అంతేకాదు అందరితోనూ శభాష్ అనిపించుకుంటున్నాడు. సిక్కు మత ధర్మం ప్రకారం తలపాగా తీయటం సంప్రదాయాలకు విరుద్దం. అంతేకాదు అదో పెద్ద తప్పు కూడా. ఏ సిక్కు కూడా అందుకు సాహసించడు. కానీ న్యూజీలాండ్ లో నివసిస్తున్న భారతీయ సిక్కు హార్మన్ సింగ్ మాత్రం ఓ బాలుడిని కాపాడేందుకు మత ధర్మాన్ని పక్కనపెట్టాడు. మానవసేవకు మించిన మాధవసేవ లేదని నిరూపించాడు.

ఆక్లాండ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. రక్తపు మడుగులో పడి ఉన్న చిన్నారిని చూసిన హార్మన్ సింగ్…వెంటనే మరో ఆలోచన లేకుండా తల పాగా తీసి బ్లడ్ పోకుండా కట్టు కట్టాడు. ఆ తర్వాత బాలుడ్ని ఆస్పత్రికి తరలించి సమయ స్పూర్తి ప్రదర్శించాడు. హార్మన్ సింగ్ బాలుడిని కాపాడిన సీన్ అంతా అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి ఇంటర్నెట్ లో పోస్ట్ చేశాడు. ఓ సిక్కు తలపాగా తీయటం తప్పే అయినా మానవత్వంతో అతను చేసిన పనిని ప్రతి ఒక్కరు అభినందించారు. ఆపదలో ఉన్న వ్యక్తిని రక్షించటానికి మత విశ్వాసాలను సైతం పక్కనబెట్టిన హర్మన్  సింగ్ నిజంగా అందరికీ ఆదర్శమే.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy