మది మదిని తట్టిలేపే.. నిన్నుకోరి

nenu-koriరివ్యూ: నిన్నుకోరి

రన్ టైమ్:2 గంటల 17 నిమిషాలు

నటీనటులు: నాని, నివేతా థామస్, ఆది పినిశెట్టి, మురళీ శర్మ, పృథ్వీ తదితరులు

స్క్రీన్ ప్లే, మాటలు: కోన వెంకట్

సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని

మ్యూజిక్: గోపి సుందర్

ప్రొడ్యూసర్స్: డి.వి.వి దానయ్య, కోన వెంకట్

కథ, దర్శకత్వం: శివ నిర్వాణ

రిలీజ్ డేట్: జులై 7,2017

 

ఇంట్రో:

వరుసగా 6 హిట్లతో మాంచి ఫామ్ లో ఉన్న నాని.. సినిమా సినిమాకు వేరియేషన్ చూపిస్తూ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్నాడు.. అదే ఊపులో కొత్త దర్శకుడు శివ నిర్వాణ తో ‘‘నిన్నుకోరి’’ అనే లవ్ స్టోరి చేశాడు. ఇంతకు ముందు ‘‘జెంటిల్ మన్’’ మూవీలో నానితో చేసిన నివేతా థామస్ హీరోయిన్ గా నటించగా.. ఆది పినిశెట్టి మరో ఇంపార్టెంట్ రోల్ చేశాడు. ట్రైలర్ తో ఇంప్రెస్ చేసిన ‘‘నిన్నుకోరి’’ ఎలా ఉందో సమీక్షిద్దాం.

కథేంటి?

వైజాగ్ లో పి.హెచ్.డి చేస్తున్న ఉమా మహేశ్వర రావు( నాని), పల్లవి (నివేథా) ప్రేమించుకుంటారు. ఇంట్లో సంబంధాలు చూస్తున్నారనీ, లేచిపోయి పెళ్లి చేసుకుందామని ఉమాను ఫోర్స్ చేస్తుంది పల్లవి. లైఫ్ లో సెటిల్ అయ్యాకే చేసుకుందామని చెప్పి పి.హెచ్ డి కంప్లీట్ చేసేందుకు ఢిల్లీకి వెళ్తాడు. ఇంట్లో కాదనలేని పరిస్థితుల్లో పల్లవి.. అరుణ్ (ఆది పినిశెట్టి) ని పెళ్లి చేసుకొని అమెరికా లో సెటిల్ అవుతుంది. ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన ఉమా ఈ విషయం తెలుసుకొని ఏం చేశాడు. పల్లవి కోసం మళ్లీ ప్రయత్నించాడా.. భగ్న ప్రేమికుడిగా మారిపోతాడా.. అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల పర్ఫార్మెన్స్:

నాని నటన గురించి కొత్తగా ఏం చెప్పేది లేదు. ఎప్పటిలాగానే న్యాచురల్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఇంత ఎమోషనల్ ఫీల్ ఉన్న మూవీలో కూడా తనదైన కామెడీ టైమింగ్ తో నవ్వులు పూయించాడు. నివేతా థామస్ సినిమాకు మరో అదనపు ఆకర్షణ. తను కూడా నాని లాగే సహజమైన నటనతో కట్టిపడేసింది. మరో హీరో ఆది సెటిల్డ్ క్యారెక్టర్ లో ఒదిగిపోయాడు. హీరోయిన్ తండ్రి పాత్రలో మురళీ శర్మ పరిణితి చెందిన నటనతో ఆకట్టుకున్నాడు. కమెడియన్ పృథ్వి అక్కడక్కడా నవ్వించాడు.

టెక్నీషియన్స్ వర్క్:

కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ గ్రాండ్ గా ఉంది. అమెరికా లొకేషన్స్ బాగా చూపించాడు. గోపి సుందర్ ఇచ్చిన పాటలు ఫర్వాలేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమా మూడ్ ను క్యారీ చేసింది. ఎడిటింగ్ బాగుంది.. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. కోన వెంకట్ డైలాగ్స్ బాగా పేలాయి.

ప్లస్ లు:

  1. ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్
  2. డైలాగ్స్, డైరెక్షన్
  3. ఫీల్ గుడ్ స్టోరీ

మైనస్ లు

  1. స్లో నరేషన్

విశ్లేషణ:

నిన్నుకోరి ఓ ఎమోషనల్ లవ్ స్టోరి. మనకు తెలిసిన కథలాగే అనిపించినా.. డైరెక్టర్ శివ నిర్వాణ ట్రీట్ మెంట్ రీఫ్రెషింగ్ గా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు ఈ సినిమాతో రిలేట్ అవుతారు. సినిమా కాస్త నీరసంగా మొదలైనప్పటికీ.. నాని ఎంట్రీ తర్వాత ఎంటర్ టైనింగ్ గా అనిపిస్తుంది. ఇక సెకండాఫ్ గ్రిప్పింగ్ గా నడిపించాడు డైరెక్టర్. ఇలాంటి సెన్సిటీవ్ సబ్జెక్ట్ ను డీల్ చేయాలంటే ఎక్స్ పీరియన్స్ కావాలి. కానీ కొత్త దర్శకుడు శివ ‘‘నిన్నుకోరి’’ ని మెచ్యుర్డ్ గా హ్యాండిల్ చేశాడు. ప్రెడిక్టబుల్ గా స్టోరీయే అయినా ఎక్కడా బోర్ కొట్టదు. కంటెంట్ బలంగా ఉండటమే దీనికి కారణం. అయితే మాస్ ఆడియన్స్ కు ఈ సినిమా అంత రుచించకపోవచ్చు. స్లో నరేషన్ సినిమాకు మైనస్ అని చెప్పాలి. ఇక క్లైమాక్స్ లో ఆది పినిశెట్టి లవ్ ఎపిసోడ్ అంత కన్విన్సింగ్ గా అనిపించదు. కంప్లీట్ చేయాలి కాబట్టి కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నట్టు అనిపిస్తుంది. ఓవరాల్ గా నాని, నివేతాల నటన.. రీఫ్రెషింగ్ స్టోరి.. ఎంటర్ టైన్మెంట్ కోసం ‘‘నిన్ను కోరి’’ ని ఒకసారి చూడవచ్చు.

బాటమ్ లైన్: ఎమోషనల్ లవ్ స్టోరీ

రేటింగ్: 3/5

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy