మద్యం మత్తులో కారు డ్రైవర్ బీభత్సం

cardriver2మేడ్చల్ జిల్లాలో షామీర్ పేట్ మండలంలోని తూంకుంట గ్రామంలో ఓ కారు డ్రైవర్ తాగిన మైకంలో బీభత్సం సృష్టించాడు. సోమవారం (ఏప్రిల్-2) డ్రైవర్ మద్యం మత్తులో కారు నడుపుతూ రోడ్డు పక్కన ఉన్న పానీపూరి బండిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. కారులో ఉన్న కూలెంట్ వాటర్ సాయి (11)అనే వ్యక్తిపై పడింది. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే 108 అంబులెన్స్ లో గాంధీ ఆస్పత్రికి తరలించారు. సాయిని తూంకుంట వాసిగా గుర్తించారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy