మధ్యప్రదేశ్ పర్యటనలో హరీష్ టీం

harish raoలేటెస్ట్ టేక్నాలజీతో ఇరిగేషన్ ప్రాజెక్టులను అభివృద్ధి చేసేందుకు రెడీ అయింది రాష్ట్ర సర్కార్. ఇతరాష్ట్రాల్లో ఉపయోగిస్తున్న టెక్నాలజీని స్టడీ చేసేందుకు మంత్రిహారీష్ రావు నేతృత్వంలోని టీం రేపు మధ్యప్రదేశ్ వెళ్తోంది. రెండు రోజుల పాటు ఎంపీలో పర్యటించనున్న కమిటీ అక్కడి సాగనీటి ప్రాజెక్టుల నిర్మాణం, నీటిసరఫరాకు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేస్తుంది.ఇరిగేషన్ టూర్లో మంత్రి హరీష్ తోపాటు పోచారం శ్రీనివాసరెడ్డి, ఈటెల రాజేందర్, ఎమ్మెల్యేలు, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు వెళ్తున్నారు. రేపు ఉదయం 8 గంటలకు ప్రత్యేక విమానంలో ఇండోరు వెళ్లనుంది మంత్రుల బృందం. టూడేస్ టూర్ లో ఓం కారేశ్వర్ ప్రాజెక్ట్, పునాస లిఫ్ట్ ఇరిగేషన్ లను మంత్రల బృందం విజిట్ చేస్తుంది. ఆయకట్టుకు పైపు లైన్లతో సాగునీరు అందించే విధానాన్ని పరిశీలిస్తుంది హరీష్. సెకండ్ డే బోపాల్ లో పర్యటించనుంది మంత్రుల బృందం. మద్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ తో హరీష్ రావు  బృదం సమావేశమై ఇరిగేషన్ ప్రాజెక్టుల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై చర్చిస్తారు. నార్మద వ్యాలీ డెవలప్ మెంట్ అథారిటీ భవనంలో ఎంపీ సీఎంతో పాటు ఇరిగేషన్ శాఖ అధికారులతోనూ డిస్కస్ చేస్తుంది హరీష్ టీం. ఆయకట్టు రైతులతో కూడా మంత్రుల బృందం చర్చిస్తుంది. సాగునీటి సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకుంటారు. నీటి పొదుపుకు అధిక ప్రాధాన్యత ఇస్తోన్న స్టేట్ సర్కార్….మధ్యప్రదేశ్ లోని పైపు లైన్ విధానాన్ని మనస్టేట్లోనూ  ఉపయోగించుకునే ఆలోచన ఉందంటున్నారు అధికారులు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy