మధ్యప్రదేశ్ లో బీజేపీకి షాక్….కాంగ్రెస్ లోకి పద్మ శుక్లా

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్ లో అధికార బీజేపీకి ఊషించని షాక్ ఎదురైంది. . సోష‌ల్ వెల్ఫేర్ బోర్డు చీఫ్ ప‌ద‌వికి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం (సెప్టెంబర్-24)  పద్మ శుక్లా ప్రకటించారు. పార్టీ ప్రాథమిక సభ్యుత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్టు ఆమె తెలిపారు. 30ఏళ్ల నుంచి బీజేపీ లో ఉన్న శుక్లాకు రాష్ట్ర కేబినెట్ హోదా కూడా ఉంది. మాజీ కేంద్రమంత్రి కమల్ నాథ్ సమక్షంలో ఆమె కాంగ్రెస్ లో చేరారు.

ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాకేశ్‌ సింగ్‌కు ఓ లెటర్ రాశారు పద్మ శుక్లా. ఈ లేఖ‌లో… 1980 నుంచి క్రీయాశీల‌కంగా పార్టీలో ప‌నిచేస్తున్నాను. పార్టీ కోసం చిత్తశుద్ధితో ఎంతో కృషి చేశాను . 2014 ఉప ఎన్నికల నుంచి విజయ్ రాఘవ్‌ ఘ‌ఢ్ నియోజక వర్గంలోని పార్టీ కార్యకర్తలను తీవ్రంగా నిర్లక్ష్యం చేయడంపై కలత చెందాను. ఆ కార‌ణంగానే  పార్టీ ప్రాథమిక సభ్యుత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. మంత్రి సంజ‌య్ పాఠ‌క్‌ తో క‌లిసి ప‌నిచేయాల‌ని రెండేళ్లుగా ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నానని. కానీ, అది అంత సులువైన విష‌యం కాద‌ని అర్థం చేసుకున్నానని, అత‌డు నా స‌హ‌చ‌రులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఇబ్బందుల‌కు గురిచేశాడని పద్మ శుక్లా తెలిపారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy