
మధ్యాహ్న భోజన పథకం కేంద్ర ప్రాయోజిత పథకం అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం తన సొంత ఖర్చుతో సన్నబియ్యం, వారానికి మూడు గుడ్లు విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ఇస్తున్నామన్నారు. దేశం మొత్తంలో మధ్యాహ్న భోజన పథకం కేవలం 8వ తరగతి వరకే అమలు అవుతుంటే.. మన రాష్ట్రంలో మాత్రమే 9,10 వ తరగతులకు కూడా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అమలు చేస్తున్నామన్నారు కడియం.
మధ్యాహ్న భోజన పథకంలో 28, 623 స్కూళ్లలో ఈ పథకం కోసం రాష్ట్రంలో ఏటా 677 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంటే..ఇందులో కేంద్రం నుంచి 300 కోట్లరూపాయలు మాత్రమే వస్తున్నాయి. ఇది కేంద్ర ప్రాయోజిత పథకమని.. ఇందులో కేంద్రం నుంచి 60 శాతం, రాష్ట్రం నుంచి 40 శాతం నిధులు ఖర్చు చేయాల్సి ఉండగా.. తెలంగాణలో మాత్రం కేంద్రం నుంచి 40 శాతం నిధులే వస్తున్నాయన్నారు మంత్రి కడియం.