మనం శత్రువులం కాదు: వెంకయ్యనాయుడు

Vice-President-Venkaiah-Naiduరాజ్యసభ చైర్మన్ హోదాలో తొలిసారి శుక్రవారం రాజ్యసభను ఉద్దేశించి ప్రసంగించారు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. మనమంతా శత్రువులం కాదని, రాజకీయ ప్రత్యర్థులం మాత్రమేనని స్పష్టం చేశారు ఆయన. ఈ మాటలను తాను మనసారా చెబుతున్నానన్నారు. ఎంపీలంతా చర్చలు జరిపి ఉత్తమమైన ఫలితాలు సాధించాలన్నారు వెంకయ్య. చట్టసభలను నంబర్ గేమ్‌గా మార్చకూడదన్నారు. ప్రజల తీర్పును గౌరవించాలన్నారు. తన రాజకీయ జీవితంలో ఎక్కువ కాలం ప్రతిపక్షంలోనే గడిచిందన్నారు. దేశాన్ని అభివృద్ధి పథంలోనడిపించేందుకు మనమంతా కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు ఆయన. దేశ వ్యవహారాల పట్ల యువత ఆసక్తి చూపుతున్నారన్నారు. మన దేశం ప్రపంచంలోనే అతి గొప్ప ప్రజాస్వామిక దేశమని కొనియాడారు ఉప రాష్ట్రపతి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy