మనకు తెలియకుండానే మనం కట్టే పన్నులివీ..

save-taxesమనకు తెలియకుండానే మనం కట్టే పనులెన్నో ఉన్నాయి. లెక్క లేసుకుంటూ పోతే.. కళ్లు తిరిగి.. చుక్కలు కనపడతాయి. ఏటా కోట్ల రూపాయల పన్నులు కడుతున్నా… దేనికి ఎంత అనేది తెలియదు మనకు. ప్రతి వస్తువుపై .. ప్రతి సేవపై పన్ను కడుతున్నాం మనం. ఇటు ప్రత్యక్ష పన్నులు.. అటు పరోక్ష పన్నులతో కోట్ల రూపాయలే కడుతున్నాం.

ఆదాయ పన్ను పక్కన పెడితే.. నిద్ర లేచిన దగ్గర నుంచి టూత్ బ్రష్ పై పన్ను, టీలు, టిఫిన్ లు, భోజనాలకు పన్ను, విందుకి వెళితే పన్ను, ఫోన్ కొంటే పన్ను, నెట్ వర్క్ చార్జ్ పన్ను, సినిమాకో, పార్క్ కో వెళితే పన్ను, స్కూల్, కాలేజీలకు వెళితే పుస్తకాలు, పెన్నులు, కంప్యూటర్లకు పన్ను, బండి ఉంటే పన్ను, పెట్రోల్ డీజిల్ పై పన్ను, పండుగలకు బట్టలు కొంటే అప్పుడూ పన్ను.. చివరికి టోల్ ట్యాక్సులు కడతాం… ఇలా అన్నింటికీ పన్నులు కడుతూనే ఉన్నాం.

ఇంకో ముఖ్య విషయం… జాబ్ చేసేవాళ్లు… వాళ్ల ఆదాయానికి కూడా పన్ను కడుతున్నారు. ఏడాదికి రూ.5 లక్షల ఆదాయం అంటే.. సుమారు నెలకు 42వేల రూపాయలున్న  ఓ మధ్య తరగతి జీవి… కట్టే మొత్తం పన్నులు లెక్కేసుకుంటే… ఎంత వరకు పే చేస్తున్నాడో తెలుసా… అక్షరాల లక్షా 34వేల 100 రూపాయలు.   ఇంకా చెప్పాలంటే… భారత ఆర్థిక శాఖ లెక్కల ప్రకారం… ప్రతి వ్యక్తి… ఏటా ఆదాయంలో 30శాతం పన్ను రూపంలో చెల్లిస్తున్నాడు. ఇక నెలవారీ, సంవత్సరం ఖర్చులను.. కట్టే పన్నులను ఒకసారి చూద్దాం…

ఉదాహరణకి నెలవారీ ఖర్చులు:

నిత్యావసరాలు       5000            1000 (పన్ను 20%)

పాలు                     2000              400

ఫాస్ట్ ఫుడ్             2000                 400

హోటల్ ఫుడ్        2000                   400

సినిమా టికెట్లు     1000                    200

కాస్మోటిక్స్          1000                     200

ఫోన్ బిల్లు             500                   100

ఇంటర్నెట్ బిల్లు      750                   150

నీటి బిల్లు             500                   175(35%)

కరెంట్ బిల్లు            1250                   75(6%)

వాహనాల రిపేర్       1000                200

మద్యం                   1000                  600(150%)

ఇతరాలు                  2000                  100(5%)

మొత్తం                    18000              4000   

 

ఏడాదికోసారి చేసే ఖర్చులు:

లైఫ్ ఇన్సురెన్స్           36000            5400(పన్ను 15%)

హెల్త్ ఇన్సరెన్స్            24000            3600(పన్ను 15%)

పెట్రోల్                      1000 లీటర్లు        36000(రూ.36/లీ.)

దుస్తులు, షూ             20,000              4000(20%)

పుస్తకాలు, స్టేషనరీ         10,000            4000(20%)

బంగారు ఆభరణాలు         20000             200(1%)

మెడిసిన్స్                    10000                   4000(20%)

టోల్ ట్యాక్సులు                గేటుల లెక్క           1000 సుమారు

బస్సు , రైలు ప్రయాణాలు     5000                  7500(15%)

మొత్తం                               165000                65700  

ఇదీ పన్నులు కట్టే తీరు. ప్రతి దానిపై మనం పన్ను కడుతున్నాం… ప్రత్యక్ష, పరోక్ష పన్నుల రూపంలో కడుతున్నామని చెప్పడానికే ఈ లెక్కలు. ఐటీ నిపుణులు కట్టిన ఈ లెక్కలు… అందరికీ ఒకేలా ఉండకపోవచ్చు. ఒక్కో మనిషికి ఒక్కోలా ఉన్నా…. సగటున చూస్తే మాత్రం… దేశంలో ఇవే లెక్కలు వర్తిస్తాయి.

3 Responses to మనకు తెలియకుండానే మనం కట్టే పన్నులివీ..

  1. P.MUNEENDRA says:

    LOOKING REAL VIEWERS LOVELY REAL VEWERS REAL MESSAGE

  2. P.MUNEENDRA says:

    LOVE REAL VEWERS

  3. P.MUNEENDRA says:

    TATA CU VEWERS REAL

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy