మనమేమైనా చీకటిరోజుల్లో ఉన్నామా..?

sunita-బయటకు వెళ్లేటప్పుడు వితంతువు కనపడితే వెంటనే ఆ ప్రయాణాన్ని ఆపేసేవారు అప్పటి వాళ్లు. ఆమెను నానా మాటలు అనేవారు. చీదరించుకునేవారు. అలాగే ఇంకొన్నాళ్లు వెనక్కు వెళితే.. సతీసహగమనం ఉండేది. ఇది 19వ శతాబ్దం ముందు రోజుల నాటి మాట. 20వ శతాబ్దంలో ఎంతో మార్పు వచ్చింది. సంఘసంస్కర్తల ప్రవేశంతో అలాంటి వాటికి కాలం చెల్లింది. అయితే అదంతా వట్టిదేనని రుజువయ్యింది. ఈ  21వ శతాబ్దంలో కూడా వితంతువుల పట్ల జనం ప్రవర్తిస్తున్న తీరు ఆనాటి చీకటి రోజులను గుర్తు చేస్తున్నాయి. బిహార్ లో జరిగిన ఓ ఘటన జనం ఇంకా ఆనాటి కాలంలోనే ఉన్నట్టు నిరూపిస్తోంది.

బిహార్ లోని గోపాల్ గంజ్ జిల్లా కల్యాణ్ పూర్ గ్రామానికి చెందిన సునీత కువార్ అనే వితంతువు ఓ స్కూల్లో మధ్యాహ్నం వంటలు వండుతోంది. ఆ స్కూల్లో ఈమెతో పాటు మొత్తం ఆరుగురు పని చేస్తున్నారు. అయితే సునీత వంటలు వండొద్దని ఆందోళనలు ప్రారంభించారు గ్రామస్థులు. 2500 జనాభా ఉన్న ఆ గ్రామంలో అగ్రకులస్థులదే ఆధిపత్యం. దీంతో ఆమెకు గ్రామం నుంచి ఎలాంటి సహాకారం లేకుండా పోయింది. ఇక చేసేది లేక డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కు తన కష్టాన్ని తెలుపుకుంది. అయినా ఉపయోగం లేకుండా పోయింది. ఒక రోజైతే ఏకంగా స్కూల్ ముందు ఆందోళనకు దిగారు కొందరు గ్రామస్థులు. ఆమెను జాబ్ నుంచి తీసెయ్యాల్సిందిగా మళ్లీ గొడవ చేశారు. అయితే దీనిపై బిహార్ ముఖ్యమంత్రి దగ్గరే తేల్చుకుంటానని తేల్చి చెప్పింది సునీత. ఎవరి ముందు తలవంచనని… తాను ఈ గ్రామం కోడలినని.. తన గౌరవాన్ని కాపాడుకొనేందుకు ఎంత దూరమైనా వెళతానని చెప్పింది సునీత. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy