మనిషి సృష్టించిన రోబోతో మనిషేకే చేటంట..!

article-1340736490915-13ca50b9000005dc-667713_466x310రోబో…మానవుడు పుట్టించిన మనిషి కాని మనిషి. మనం క్రియేట్ చేసిన…రోబోలు ఇప్పుడు మన కుర్చి కిందికే నీళ్లు తెస్తున్నాయి. రోజురోజుకు అప్ డేటెడ్ రోబోట్స్ వస్తున్నాయని మురిసిపోతున్నాం. కానీ…అవి మనిషిని ముంచేస్తున్నాయన్న సంగతి మర్చిపోతున్నాం. అసలు మనిషి మనుగడకు, రోబోలకు లింకేంటి..? అంతగా ఏం చేస్తున్నాయీ రోబోలు.  రోబో…హ్యూమనాయిడ్ మిషన్. మనిషి సృష్టించిన మర మనుషులే ఈ రోబోలు. మనిషి రోజంతా చేసే పనిని…రోబో ఒకే గంటలో ఫినిష్ చేస్తుంది. గంట పనిని సెకన్లలో కంప్లీట్ చేస్తున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే…ఇప్పుడు మనిషి చేసే పనిని వంద రెట్ల ముందుగానే రోబోలు పూర్తి చేస్తున్నాయి. అంటే…ఒక రోబో వందమందితో సమానమవుతోంది. ఇప్పుడిదే డేంజర్ గా మారుతోంది.

ఇలాగే అప్ డేటెడ్ రోబోస్ వస్తే…మనిషి కుర్చి కిందికే నీళ్లు వస్తాయి. కొలువులు పోతాయి. అప్పుడు మనం సృష్టించిన రోబోలు కూడా మనకు హెల్ప్ చేయవు. ఇప్పుడు ఇలాగే వార్నింగ్ ఇస్తున్నారు ఎక్స్ పర్ట్స్. వాస్తవంగా చూసుకున్నా ఇది నిజమనే అనిపిస్తోంది. మొదట్లో కొన్ని కొన్ని పనులకే రోబోలను వాడే వారు. ఏ రిసెప్షనిస్టులుగానో…హాయ్, హలో చెప్పేందుకు గేట్ ముందో నిల్చో బెట్టేవాళ్లు. కానీ..ఇప్పుడు మనిషి మాట విని వెంటనే పనికి ఒదిగిపోయే రోబోస్ కూడా వచ్చేస్తున్నాయి. వాటి బుర్రకు పదును పెడుతున్నారు సైంటిస్టులు. అంతకంతకు వాటి వర్క్ లో క్వాలిటీ పెంచుతున్నారు. ఇంకేముంది…బడా కంపెనీస్ అన్నీ రోబోలకే జాబ్స్ ఇవ్వడానికే ఇంట్రెస్ట్ చూపుతున్నాయి. రోబోస్ కాకుండా… మనిషికి జాబ్ ఇస్తే అతనికి నెలనెలకు జీతమివ్వాలి. ఏటేటా హైక్స్ ఇవ్వాలి….ఇంకా బోలెడు ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదే ఒక్కసారి రోబోలను కొనిపడేశామంటే… మనం చెప్పినట్టు అవి వింటాయనే కాన్సెప్ట్ తో ఉన్నాయి కంపెనీస్.

రోజురోజుకి రోబోల వాడకం పెరుగుతోంది. జపాన్ లాంటి దేశాల్లో దాదాపు అన్నీ హోటల్స్ లో రోబోసే పనిచేస్తున్నాయి. రిసెప్షన్ కాన్నుంచి సర్వర్, క్యాష్ కౌంటర్…చివరికి వంటలు కూడా వండేస్తున్నాయి. ఇన్నీ పనులు రోబోలే చేస్తుంటే.. ఇక ఏ హోటలు మనుషులకు జాబ్స్ ఇవ్వదు. పెప్పర్ రోబో. జపాన్ లోని చాలా బ్యాంకుల్లో పనిచేస్తున్నాయి ఈ రోబోలు. టెక్నాలజీ పరంగా పెప్పర్ రోబోలు  చాలా అడ్వాన్స్ డ్. బ్యాంకుకొచ్చే కస్టమర్లతో ముచ్చటిస్తాయి. కస్టమర్ కు కావాల్సిన అన్ని వివరాలు ఇవే చేసేస్తున్నాయి. బ్యాంకు లావాదేవీలకు సంబంధించి కొంత వరకు రోబో కు ప్రోగ్రామింగ్ ఫీడ్ చేసి వదిలేస్తారు. దీంతో కస్టమర్లతో కబుర్లు చెప్పేస్తాయి పెప్పర్ రోబోలు.

ఇలా…ఒక్క హోటల్, బ్యాంకుల్లోనే కాదు. ఇంకా చాలా రంగాల్లో మనుషులకు పోటీగా దూసుకెళ్తున్నాయి రోబోలు. టోల్ బూతు ఆపరేటర్స్ గా, క్యాషియర్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, ఫ్యాక్టరీల్లో కార్మికుల పనిచేస్తున్నాయి. ఇంకా కష్టమర్ కేర్ సెంటర్లలో, టెలికాం సంస్థల్లో ఫోన్ బిల్లింగ్ చేసేవారిలా…ఇలా చాలా రంగాల్లో రోబోలు పాతుకుపోయాయి. అంతేకాదండోయ్…ఇంకొన్ని రోబోస్ అయితే… అసోసియేటెడ్ ప్రెస్ కు వేలల్లో కథనాల్ని ఎడిటింగ్ చేసేస్తున్నాయట. కొన్ని కొన్ని ఫారిన్ కంపెనీలైతే ఏకంగా ఉన్న ఉద్యోగులను పీకేసి మరీ… రోబోస్ తెచ్చుకుంటున్నారట. అంటే దీన్ని బట్టే అర్థమవుతుంది. మనిషిని ఏ రేంజ్ లో రోబోస్ డామినేట్ చేస్తున్నాయో..? క్లీయర్ గా అర్థమవుతోంది.

ఇప్పటికైతే మనం సేఫ్ జోనే. ఎందుకంటే ఇంకా ఇండియాలోకి ఈ రోబోస్ ఎంటరవ్వలేదు. కానీ.. ఫ్యూచర్ లో మన దేశంలోకి కూడా వచ్చే ఛాన్స్ లేకపోలేదు. పులిని చూసి నక్క వాతపెట్టుకున్నట్టు మన దగ్గర కూడా కొన్నికొన్ని బడా కంపెనీలు…రోబోలను ప్రిఫర్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మనిషి చేసే ప్రతీ పనిని రోబోలే చేస్తే…ఇక ఫ్యూచర్ లో కొన్ని ఉద్యోగాలు అందని ద్రాక్షేనట. టెక్నాలజీ ఎంత పెరుగుతుందో…అంతే స్థాయిలో అనర్థాలు కూడా రెట్టింపు అవుతున్నాయి. ఇప్పుడు రోబోస్ కూడా అదే స్థాయికి చేరుకున్నాయి.  అయితే…టెక్నాలజీని ఎవరూ వ్యతిరేకించడం లేదు. కానీ…మన అవసరాల కోసమే టెక్నాలజీ అన్నట్టుగా ఉండాలి. అంతేకానీ…అసలికే ఎసరు తెస్తే…ఎంత అడ్వాన్స్ డ్ టెక్నాలజీ వచ్చినా వేస్ట్.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy