మనుషులంతా ఒక్కటే: కాశ్మీరీ పండిట్ కు ముస్లింల అంత్యక్రియలు

Kashmiri pandit man final rites performed by Kashmir muslimsమతాలు వేరయినా ..మనుషులంతా ఒక్కటే అన్న నిజాన్ని.. ప్రపంచానికి నిజం చేసి చూపించారు అక్కడి ప్రజలు. చనిపోయిన ఓ హిందువుకు అంత్యక్రియలు నిర్వహించారు ముస్లింలు. జమ్మూకశ్మీర్‌లో ముస్లింలు, హిందువులకి మధ్య అస్సలే పడటం లేదనే ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెడుతూ తామంతా ఒక్కటే అని నిరూపించారు. ఈ ఘటన పుల్వామా జిల్లాలో జరిగింది. పుల్వామా జిల్లాలో ఓ కాశ్మీరీ పండిట్ మృతిచెందగా.. స్థానిక ముస్లిం సోదరులు అతడి మృతదేహానికి స్వయంగా దగ్గరుండి అంతిమ సంస్కారాలు పూర్తిచేశారు.

హిందూ సంప్రదాయం ప్రకారమే అతడి అంత్యక్రియల్లో పాల్గొని దహన సంస్కారాలు పూర్తయ్యేవరకు ఆ కాశ్మీరి పండిట్ కుటుంబానికి అండగా నిలిచారు. అంత్యక్రియలకి అవసరమైన ఏర్పాట్లన్నీ తామే దగ్గరుండి చూసుకున్నారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy