మన కేబినెట్ విస్తరణ ముహూర్తం ఎప్పుడో….!

ఆషాడం, శ్రావణం, దసరా, దీపావళి.…. ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు.

గులాబీదండులో రోజుకోమాట..పూటకో పుకారు.

అసలు మంత్రివర్గ విస్తరణ ఉంటుందా? ఉంటే ముహూర్తం ఎప్పుడు? అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తర్వాత.. మంత్రివర్గ విస్తరణ ఉంటుందా?

ఇది, టీఆర్ఎస్ నేతలకు అంతు చిక్కని ప్రశ్నగా మారింది.

కేబినెట్ విస్తరణ చాలామంది నేతలను ఊరిస్తూనే ఉంది. ముహూర్తం కోసం.. ఆశావహులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కానీ కేసీఆర్ మాత్రం ఆ జోలికి పోవటంలేదు. ఎప్పుడు ఉండబోతుందో కూడా చెప్పటంలేదు. మినిస్ట్రీపై ఆశలు పెట్టుకున్నవాళ్లు.. ఈ విషయాన్ని కేసీఆర్ ముందు ప్రస్తావించేందుకు జంకుతున్నట్లు సమాచారం. జిల్లాల నుంచి మీడియాకు లీకులు ఇచ్చి.. కేసీఆర్ దృష్టిలో పడే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మధ్య టీఆర్ఎస్ లో చేరిన ఖమ్మం జిల్లా సీనియర్ నేత.. ఇలాంటి ప్రయత్నమే చేసి విఫలమయ్యారు.

ఇక కేసీఆర్ తో కాకుండా.. టీఆర్ఎస్ లోని సీనియర్ల చూట్టూ చకర్లు కొడుతున్నారు.. మంత్రి పదవులు అశిస్తున్నవారు. ఈసారి జరిగే మంత్రివర్గ విస్తరణలో జిల్లాలు, సీనియారిటీ, సామాజిక నేపథ్యం ఆధారంగా భర్తీ ఉంటుందని టీఆర్ఎస్ అంటోంది. అది ఎప్పుడనేది ఇంకా స్పష్టం కాలేదు. ఉంటుందని మాత్రం అంటున్నారు. మొదటి దశలో మహిళలకు చోటు దక్కకపోవడంతో, ఈసారి మహిళకు బెర్త్ ఉంటుందని తెలుస్తోంది. ఖమ్మం, మహబుబ్ నగర్ జిల్లాల వారికి కూడా విస్తరణలో చాన్స్ ఉంటుందని తెలుస్తోంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy