మన గల్లీలకూ వచ్చేశాయ్ : గంజాయి చాక్లెట్లు

ganjaiగంజాయి అంటే ఎవరికీ తెలియకుండా.. సీక్రెట్ నాలుగు గోడల మధ్య తీసుకునేది అనేది ఇప్పటి వరకు ఉన్న అభిప్రాయం. సిగరెట్ లోనో.. OCB పేపర్, చెక్క చిల్లం ద్వారా పీల్చేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. చాకెట్ల రూపంలో వచ్చేంది. షాప్ కు వెళ్లి కోడ్ భాషలో చాకెట్ అని అడిగితే చాలు.. ఎన్ని కావాలంటే అని చేతిలో పెట్టేశారు. గంజాయి అని కూడా తెలియదు. చక్కగా పేపర్ తీసేసి.. నోట్లో వేసుకుని చప్పరించేయొచ్చు. ఇంట్లో పిల్లలు తినేది మామూలు చాకెట్లా.. గంజాయిదా అనేది కూడా తెలియదు. ఇంత దారుణంగా మార్కెట్ ను ముంచేసింది గంజాయి మాఫియా. నిజామాబాద్ లో వెలుగుచూసిన గంజాయి చాక్లెట్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలన అయ్యాయి. కలకలం రేపుతున్నాయి.
ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు గంజాయినీ చాక్లెట్ల రూపంలో విక్రయిస్తున్నారు. నిజామాబాద్‌ జిల్లాలో వెలుగుచూడటం పోలీసులను సైతం నివ్వెరపోయేలా చేసింది. నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ ప్రాంతంలో వీటిని అమ్ముతున్నారు. ఈ చాక్లెట్లు రాజస్థాన్‌లోని బాదర్‌ ప్రాంతంలో తయారైనట్లు నిర్ధారించారు. వినియోగదారుల నుంచి ఫిర్యాదులు రావడంతో అప్రమత్తమైన ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ శాఖ అధికారులు లలితామహాల్‌ థియేటర్‌ సమీపంలోని పద్మావతి నావెల్టీస్‌ షాపులో దాడులు నిర్వహించారు. నిర్వాహకుడిని రెడ్‌హ్యాండెండ్‌గా పట్టుకున్నారు. 28 చాక్లెట్‌ కార్టూన్లను సీజ్‌ చేశారు. ఒక్కో కార్టూన్ లో 500 చాక్లెట్లు ఉన్నట్లు గుర్తించారు. మొత్తంగా 15వేలు స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో చాక్లెట్ ను ఐదు రూపాయలకు విక్రయిస్తున్నారు. ల్యాబ్‌కు పంపించి పరీక్షలు నిర్వహించగా వాటిలో గంజాయి ఉన్నట్టు గుర్తించారు. 8నెలల నుంచి ఈ గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్నట్టు తేలింది. నిజామాబాద్ కేంద్రం ఇతర పట్టణాలు, పల్లెలకు వీటిని సరఫరా చేస్తున్నారు. విషయం తెలిసిన పోలీసులు.. పలు బృందాలుగా ఏర్పడ్డారు. ఏయే ప్రాంతాలకు సరఫరా అయ్యాయి.. ఏయే షాపుల్లో విక్రయిస్తున్నారనే విషయాలను ఆరా తీస్తున్నారు. వీటిని వినియోగించే ఎవరినీ అరెస్టు చేయలేదని, ఈ చాక్లెట్లను పాఠశాలలు, కళాశాలల వద్ద అమ్ముతున్నారా? అనే కోణంలో విచారిస్తున్నామని తెలిపారు ఎక్నైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్ ప్రకటించారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy