మన జూ పార్కుకి 52 ఏళ్లు

81400657244_0_650X300నెహ్రూ జూ పార్క్… హైదరాబాద్ టూరిస్ట్ స్పాట్ లలో ఒకటి. చిన్నా పెద్దా తేడా లేకుండా అందర్నీ అలరించే పార్క్. అది ప్రారంభమైంది ఇవాళే. 1963 అక్టోబర్ 6 న నెహ్రూ జులాజికల్ పార్క్  ప్రారంభమైంది. మీరాలం చెరువుపై 380 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేశారు. 11 వందల జంతువులు, వందకు పైగా జాతులతో ఈ జూపార్క్ మొదలైంది. నాటి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ దీన్ని ప్రారంభించారు. ఆయన చనిపోయాక ఈ పార్క్ కు నెహ్రూ జూపార్క్ అని పేరు పెట్టారు. అందమైన ప్రకృతి ఒడిలో వందల రకాల.. రంగు రంగుల వింతైన పక్షులు….మరెన్నో రకాల జంతువులు పార్క్ లో కనువిందు చేస్తాయి. సెలవు దినాలే కాకుండా నిత్యం జూపార్క్ సందర్శకులతో కిటకిటలాడుతూ ఉంటుంది.

‘జూ’ లో రోజూవారీ కార్యక్రమాలు:

  • జూలో జంతువులకు ఆహారం అందించే విషయంలో వెటర్నరీయన్స్ పర్యవేక్షణలో జరుగుతుంది.
  • మాంసాహార జంతువులకు రోజూ 350 కిలోల పైన మాంసాహారం అందిస్తారు. 20 కిలోల బీఫ్, 75 కిలోల చికెన్, 40 కోడిపిల్లలు, 100 పైన గుడ్లు అందిస్తారు.
  • శాకాహార జంతువులకు ప్రత్యేక ఆహార వసతిని కల్పిస్తారు. కూరగాయలు, గడ్డి, తృణధాన్యాలు ఇస్తారు. వీటి కోసం ప్రత్యేకంగా 7 ఎకరాల్లో గడ్డి పెంచుతున్నారు. పిల్లలకు పాలిచ్చే జంతువులకు, గర్భంతో ఉన్నవాటికి, అనారోగ్యంతో బాధపడుతున్న వాటిని స్పెషల్ గా ట్రీట్ చేస్తారు.
  • డాక్టర్లు కూడా ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. రోజూ ఉదయమే విధిగా వీటిని సందర్శించి.. ఆరోగ్యాన్ని పరిశీలిస్తారు. వైరల్ ఫీవర్లు, అంటువ్యాధులు రాకుండా ప్రత్యేకమైన టెస్టింగ్ ల్యాబ్ లు కూడా ఏర్పాటు చేస్తారు.
  • జూలో ఎన్నో అరుదైన వన్యప్రాణులు ఉన్నాయి. ఏసియాటిక్ 23 సింహాలు, 24 తెల్లపులులు ఉన్నాయి. జూలో 85 ఏళ్ల వయస్సున్న తాబేలు ఉంది. ఇది జూ ప్రారంభించినప్పటి నుంచి ఉంది. 55 ఏళ్ల ఆడ ఏనుగు, 42 ఏళ్ల ముసలి, 23 ఏళ్ల పెద్దపులి, 19 ఏళ్ల పెద్దపులి ఉన్నాయి.
  • ఇక్కడి వన్యప్రాణులకు చక్కని పేర్లు పెడుతుంటారు జూ అధికారులు. ఏనుగులు, సింహాలు, పులులకు మంచి మంచి పేర్లు ఉన్నాయి. జ్యోతి, అరుణ, శిల్ప లాంటి అచ్చ తెలుగు పేర్లే కాదు… మున్నీ, రీటా, సోని లాంటి మోడర్న్ నేమ్స్ ఉన్నాయి. సినీ గ్లామర్ కూడా తోడయ్యింది వీటికి. ప్రభాస్, కరీనా, సైఫ్ పేర్లు ఇక్కడి వినిపిస్తుంటాయి.
  • రోజూ సుమారు 8వేలకు పైగా సందర్శకులు వస్తుంటారు. దీంతో వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక భద్రత కల్పిస్తున్నారు. మొదట జూ ఎంట్రన్స్ దగ్గర, వీటికి ఆహారాన్ని తీసుకొచ్చే గేటు దగ్గర కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నారు.
  •  ప్లాస్టిక్ ఫ్రీ జోన్ గా జూని ప్రకటించారు. పరిశుభ్రత, కాలుష్య నివారణ కోసం సిబ్బంది రోజూ ఎంట్రీ దగ్గర వస్తువులను స్క్రీనింగ్ చేస్తారు. విజిటర్స్ ప్లాస్టిక్ వస్తువులు తీసుకువస్తే వాటి స్థానంలో పేపర్ బ్యాగులు అందిస్తున్నారు.

61400657326_3_650X300

61400657244_2_650X30051400657270_0_650X300

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy