మన దౌర్భాగ్యం : పడుకోటానికే పాఠశాలకు వస్తాడంట

BIHAR

అసలే గుడ్డిలో దీపంలా ఉన్నాయి సర్కారీ చదువులు.. ఎప్పుడు వస్తారో.. ఏం చెబుతారో కూడా తెలియదు పంతుళ్లు.. వచ్చినా పాఠాలు చెబుతారా అంటే అదీ లేదు.. పిల్లలపాటికి పిల్లలు.. పంతుళ్ల పాటికి పంతుళ్లు.. సర్కార్ జీతాలు ఠంచనుగా ఇస్తున్నా.. పిల్లల చదువు అంతంత మాత్రమే. ముఖ్యంగా బీహార్ రాష్ట్రంలో అయితే.. గవర్నమెంట్ స్కూల్స్ ఎలా నడుస్తున్నాయో చెప్పటానికి ఇదొక్క ఫొటో చాలు.

బీహార్ రాష్ట్రం మద్దిపూర్ లోని ఓ ఉర్దూ స్కూల్ లో యథావిధిగా స్కూల్ కు వచ్చాడు టీచర్. వచ్చీ రాగానే కుర్చీలోనే కూర్చుని నిద్రపోయాడు. పాపం బయట ఎంత కష్టపడ్డాడో కానీ.. క్లాస్ ముగిసినట్లు బెల్ కొట్టినా నిద్ర లేవలేదు. అంతేనా.. పిల్లలు కూర్చునే బెంచ్ పై కాళ్లు పెట్టి.. గుర్రు పెట్టి నిద్రపోయాడు. ఈయన పేరు అశోక్ కుమార్ యాదవ్. ఈ సారుగారికి ఇది కొత్త కాదంట. ఎప్పుడు క్లాస్ కు వచ్చినా ఇలాగే నిద్రపోతాడని.. అస్సలు పాఠాలు చెప్పిన పాపానే పోలేదని పిల్లలు అమాయకంగా చెబుతున్నారు.

ఈ టీచర్ కు ఇంకో బలుపు కూడా ఉందండీ.. క్లాస్ లో నిద్రపోతున్నప్పుడూ పిల్లలు ఎవరూ డిస్ట్రబ్ చేయకూడదు. అలా చేస్తే కొడతాడు. అంతే కాదు మన సార్ గారు నిద్రపోతున్న సమయంలో క్లాస్ బెల్ మోగినా పిల్లలు బయటకు వెళ్లకూడదు. ఆయనగారు ఎప్పుడు నిద్ర లేస్తే అప్పుడే పిల్లలు కూడా బయటకు వెళ్లాలి. అప్పటి వరకు పిల్లలు భయంతో వణుకుతూ.. నిశ్చబ్ధంగా కూర్చోవాలంట. లేకపోతే ఆ క్లాస్ లోని పిల్లలకు కొడతాడంట. మరి ప్రిన్సిపాల్ ఏం చేస్తున్నాడు అంటే.. ఆయన.. ఈయన కంటే పెద్ద మేధావి అని చెబుతున్నారు. టీచర్ అశోక్ ప్రవర్తనపై మిగతా స్టాఫ్, కొంత మంది పిల్లలు కంప్లయింట్ చేసినా పట్టించుకోరంట.

మరి ఈ ఫొటో ఎలా వచ్చిందా అనేగా మీ డౌట్. కొంత మంది పిల్లలు ఇళ్ల దగ్గర ఈ టీచర్ గారి ప్రవర్తన గురించి మాట్లాడుకుంటుండగా కొంత మంది పేరంట్స్ విన్నారు. ఈ క్రమంలోనే సార్ గారు క్లాస్ కు వచ్చి నిద్రపోతున్నప్పుడు ఫొటోలు తీసి ఉన్నతాధికారులకు కంప్లయింట్ చేయటంతోపాటు.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే.. 24 గంటలు కాలేదు దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది. ఈ సార్ గారి బాగోతంపై తిట్టినతిట్టు తిట్టకుండా తిడుతున్నారు నెటిజన్లు. మన దౌర్భాగ్యం. ఇలాంటి పంతుళ్ల వల్లే ప్రభుత్వ స్కూల్స్ నాశనం కావటమే కాదు.. రేపటి తరం పనికి రాకుండా పోతుంది అంటున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy