మన పోలీస్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శం: నాయిని

Naini-Narasimha-Reddy-Speech-At-Police-Martyrs-Dayశాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు ఎనలేని కృషి చేస్తున్నారన్నారు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి. హైదరాబాద్ గోషామహల్ స్టేడియంలో పోలీసు అమలరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ అనురాగ్‌శర్మ తో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. పోలీసు అమర వీరుల స్థూపం దగ్గర  పుష్పగుచ్ఛాలు ఉంచి  నివాళులర్పించారు. తర్వాత తపాలా బిల్ల, పోస్టల్ కవర్‌ను ఆవిష్కరించిన నాయిని… పోలీసులు సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేపడుతున్నారన్నారు. రాష్ట్ర పోలీస్ వ్యవస్థ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. పోలీసు అమరవీరుల త్యాగాలకు మనమంతా రుణపడి ఉండాలన్నారు.

శాంతిభద్రతలు బాగుంటే రాష్ట్రం బాగుంటుందన్నారు హోంమంత్రి నాయిని. బంగారు తెలంగాణలో శాంతి భద్రతలు కీలకమన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా పోలీస్‌శాఖకు అధికంగా నిధులు కేటాయించినట్లు తెలిపారు. న్యూయార్క్‌కు చెందిన ఓ సంస్థ చేపట్టిన సర్వేలో వరసగా రెండో ఏడాది నివాస యోగ్యమైన నగరంగా హైదరాబాద్ నిలిచిందన్నారు. సామాజిక రుగ్మతలు అరికట్టడానికి కృషి చేశామని తెలిపారు.

మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన షీటీమ్స్, భరోసా సెంటర్ మంచి ఫలితాలు సాధించిందన్నారు నాయిని. వీటిని జిల్లాలకు విస్తరించినట్లు తెలిపారు. పోలీసింగ్‌లో అంతర్జాతీయస్థాయి ప్రమాణాలు, పరికరాలు, టెక్నాలజీని వాడుతున్నట్లు చెప్పారు. పోలీస్‌శాఖలో అత్యధికంగా నియామకాలు చేపట్టినట్లు తెలిపారు. అమరవీరులకు దేశంలో ఏ రాష్ట్రం చేపట్టని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని.. మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు హోంమంత్రి నాయిని.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy