మన “బంగారు” లోకం!

gol1

మతమేదైనా మన సంస్క్రతి  సాంప్రదాయాలకు ఓ ప్రత్యేకత ఉంది. అది పెళ్లైనా,, మరో ఫంక్షనైనా వచ్చే అతిథులు ఎదో ఒకటి బహుమతిగా ఇవ్వడం ఆనవాయితి. ఇలా ఇచ్చేవాటిలో గోల్డ్ దే మొదటి ప్లేస్. ఇక పెళ్లి  సంగతి చెప్పనక్కర లేదు…. ఎంత పేదవాడైనా సరే పెళ్లిలో అమ్మాయి కి  తాహాతుకు తగ్గట్టుగా ఎంతో కొంత బంగారం  ఇవ్వడం ఓ సంప్రదాయం. ఇలా ప్రతీ సందర్భంలోనూ.. బంగారాన్ని ఓ మంగళకరమైన వస్తువుగా భావిస్తారు.

కటిక పేదవాడైనా సరే జీవితంలో ఒకసారైనా . ఎదో ఒక రూపంలో ఎంతో కొంత బంగారాన్ని కోనుగోలు చేస్తారు. భవిష్యత్తులో కష్టం వస్తే బంగారం ఉందనే భరోసా ఎంతో ధైర్యాన్నిస్తుందనేది చాలా మంది అభిప్రాయం.. ఇక మహిళలకైతే బంగారం పై ఉన్న మక్కువ వర్ణించడం కష్టమే.. బహుమతి నగదు రూపంలో ఇచ్చేకంటే అంతే విలువ చేసే బంగారాన్ని ఇస్తే అదీ వారు జీవితంలో మరిచిపోలేరు..

అభివ్రుద్ది చెందిన దేశాల్లో బంగారాన్ని కేవలం పెట్టుబడిగానే చూస్తారు. కానీ మన దేశంలో బంగారాన్ని ఓ సెంటిమెంట్ గా భావిస్తారు. ఆర్థక ఇబ్బందులెదరైనపుడు తప్పనిసరైతే తప్పబంగారాన్ని కుదువ పెట్టేందుకో.. ఆదీ సాధ్యం కానప్పుడు మాత్రమే అమ్ముతారు.

దేశీయ మార్కెట్లో బంగారాన్ని ఎక్కువగా  వస్తు రూపంలోనే కొనుగోలు చేస్తాం. ఇలా కొన్న బంగారాన్ని కడ దాక ఉంచుకోవడానికే ఇష్టపడతాం. అదే విదేశాల్లో అయితే బంగారాన్ని ఆదాయం పెంచుకునేందుకు కేవలం ఓ కమోడిటిగానే చూస్తారు. ఇలా కొన్న బంగారం కూడా కేవలం అకౌంట్ లోనే ఉంటుంది.. కానీ మనం కొన్న  బంగారాన్ని వస్తురూపంలో తీసుకోవడానికే ఎక్కవగా మొగ్గు చూపుతాం. మార్కెట్లో ఒడిదుడుకులు ఎదురైనప్పుడు కూడా బంగారం విలువ తగ్గదనేది  ఓ బలమైన నమ్మకం..

ప్రపంచంలోనే అతి ఎక్కవగా బంగారాన్ని వారిలో మనమే నెంబర్ వన్. మన వద్ద ఇప్పడు ఎంత బంగారం ఉందో తెలసా.  తెలుసుకుంటే ముక్కున వేలేసుకోక తప్పది. మన దేశంలో అందరి దగ్గర ఉన్న సుమారు 18వేల టన్నలు బంగారం ఉందని వల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఓ రిపోర్ట్ లో వెల్లడి చేసింది. దీని విలువ అక్షరాల  తొమ్మిది వందల యాభై లక్షల కోట్ల రూపాయలు..  ఇది మన జాతీయ స్థూల ఉత్పత్తిలో సగం. ఇంతగా మన దగ్గరగా బంగారం ఉండటానికి కారణం  మనం సంపాదించే వార్షిక ఆదాయంలో  10 శాతం బంగారాన్ని కొనేందుకు కేటాయిస్తున్నాం.

పది సంవత్సరాల క్రితం గ్రాము బంగారం ధర సుమారు ఐదు వేల రూపాయలు.. ఇప్పుడది ఆరు రెట్లు పెరిగిపోయింది. గత కొన్నేళ్లుగా ఏటా బంగారం ధర దాదాపు 20  శాతానికిపైగా  పెరుగుతోంది.. అయినప్పటికి బంగారం కొనుగోళ్లు ఏమాత్రం తగ్గలేదు..  దేశంలో కొనుగోలు చేసే బంగారంలో 90 శాతనికి పైగా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం.  ఇది సుమారు  800 నుంచి 1200 టన్నుల దాకా ఉంటోంది. కేవలం ఆభరణాల రూపంలోనే కాకుండా బిస్కెట్స్, బార్స్, పెల్లెట్స్ రూపంలో బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇటీవల బంగారం దిగుమతుల కారణంగా కరెంటు ఖాతాలోటు భారీగా పెరుగుతుందన్న ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిగుమతులపై ఆంక్షలు విధించింది. దీంతో ఈ ఏడాది బంగారు దిగుమతులు సుమారు 50 టన్నలుకు పడిపోయాయి.

మన దేశంలో బంగారు ఆభరణాలను చెడగొట్లి మరో ఆభరాణాన్నిగా మార్చేందుకు పెద్దగా ఇష్టపడరు.. కొత్తగా కొనుగోలు చేస్తున్న బంగారంతో పోలిస్తే రిసైల్ చేసే బంగారం కేవలం ఎనిమిది శాతం మాత్రమే. పాత గోల్డ్ ఆర్నమెంట్స్ ను అమ్మితే  తరుగు, మజూరు, తయారీ చార్జీలు ఇలా  దాదాపు 20 నుంచి 25 శాతం వరకు నష్టపోవడం కూడా రీసైక్లింగ్ వైపు ఆసక్తి చూపకపోవడాని ఒక కారణంగా చెప్పవచ్చు..

బంగారం అనగానే మనవాళ్లు ఆభరణాలు కొనడానికే ప్రాధాన్యతనిస్తారు. ఇక పెట్టుబడిగా పెట్టాలంటే నాణేలు, బిస్కెట్లు కొంటుంటారు. అయితే నిజానికి పుత్తడిలో పెట్టుబడి పెట్టడానికి ఇవేవీ సరైన పద్దతులు కావంటున్నారు ఎనలిస్టులు.. ఇవేవీ మార్కెట్ ధరకు దొరకవు. పైగా నాణ్యత, భద్రత పరంగా చాలా సమస్యలు ఉంటాయి. అందుకే పెట్టుబడి సలహాదారులు ఎక్స్ఛేంజీ ట్రేడెడ్ ఫండ్ ల ద్వారా బంగారంలో పెట్టుబడి పెట్టడం మంచిదని సూచిస్తున్నారు. ఇందులో ఒక గ్రాము నుండి ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. మార్కెట్ లో బంగారం రేటు ఎంత ఉంటే అంతకే లభిస్తుంది. అమ్మేటప్పుడు కూడా మార్కెట్ రేటుకే అమ్మవచ్చు.

నెల నెలా గానీ, 3 నెలలకు గానీ, 6 నెలలకు గానీ ఒకసారి ఈ ETF లు కొనుక్కోవచ్చు. మీరు కొన్న బంగారం వస్తురూపంలో కాకుండా పేపర్ మీదే ఉంటుంది కాబట్టి భద్రతకు ఎలాంటి ఢోకా ఉండదు. నాణ్యత గురించి కూడా చింతించాల్సిన అవసరం లేదు. మార్కెట్ ధరను బట్టే బంగారం అమ్మకాలు కొనుగోళ్లు సాగుతాయి కాబట్టి నాణ్యత, భద్రత లాంటివాటి గురించి బెంగ పడాల్సిన పనిలేదు. స్టాక్ మార్కెట్లో షేర్ల లాగానే అమ్మాలనుకున్నప్పుడు మార్కెట్ ధరకు అనుసారంగా అమ్మేయొచ్చు.. బంగారం కంటే ETF ల రూపంలో పెట్టుబడులు పెట్టడం మంచిదే కాని.. ETF ల రూపంలో బంగారంలో పెట్టిన పెట్టుబడిలపై ఎలాంటి వడ్డీగానీ, డివిడెంట్ గానీ రాదనే సంగతి మర్చిపోకండి. కేవలం పెట్టుబడిపై పెరిగిన ధరే ఇందులో లాభం.. అందుకే మొత్తం పెట్టుబడిలో 15 శాతానికి మించి బంగారంలో పెట్టకపోవడమే మంచిది.

పోయినేడాది ఆల్ టైం హైని టచ్ చేసిన బంగారం ధర మెల్లగా తగ్గుతూ వస్తోంది. అంతర్జాతీయంగా పసిడి కి డిమాండ్ పడిపోవడంతో పుత్తడి ధరలు దిగివస్తున్నాయి. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ మెల్లగా బలపడుతుండడంతో గోల్డ్ రేటు 30 వేల రూపాయల వద్ద స్థిరంగా ఉంది. ఇంటర్నేషనల్  మార్కెట్లో  ఔన్సు బంగారం ధర 12 వందల డాలర్లకు పడిపోయాయి. పండగల సీజన్ అయిపోవడంతో.. డిమాండ్ తగ్గి పుత్తడి దిగుమతులు గణనీయంగా తగ్గిపోయాయి. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ మరింత బలపడితే పుత్తడి ధరలు భారీగా తగ్గే అవకాశాలున్నాయి.. ఫిబ్రవరి నుండి పెళ్లిళ్ల సీజన్ మొదలవుతుండడంతో ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో లేని కొనుగోళ్ల మళ్లీ పెరుగుతాయని జ్యువెల్లరీ షాపులు ఓనర్లు ఆశభావంతో ఉన్నారు. అయితే లోకల్ గా డిమాండ్ పెరిగినా అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్ లేకపోవడంతో ధరలు పెరిగకపోవచ్చని బులియన్ వర్గాల అంచనా.. ప్రస్తుతం హైదరాబాద్ లో 24 కేరెట్ల ప్యూర్ గోల్డ్ ధర 29 వేల 4 వందల రూపాయలు కాగా.. 22 కేరెట్ల ఆర్నమెంట్ బంగారం ధర 28 వేల 6 వందల రూపాయలు.. రూపాయి బలపడితే పసిడి ధరలు మళ్లీ 26 వేల రూపాయల దిగువకు వచ్చే అవకాశాలు లేకపోలేదు.

by Panduranga Reddy

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy