మన రోడ్లపైనే : 2020 నాటికి కరెంట్ కార్లు

suzuki-toyota-logo_827x510_715109086732020 కల్లా భారత్ లో ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టే దిశగా మారుతి సుజుకీ కసరత్తులను ప్రారంభించింది. దీని కోసం టయోటోతో చేతులు కలిపింది. రెండు సంస్థల  ఒప్పందం ప్రకారం భారత్ కోసం తయారు చేస్తున్న ఎలక్ట్రిక్ కార్లలో కొన్నింటిని సుజుకీ కంపెనీ టయోటకు కూడా సరఫరా చేయనుంది. ప్రతిగా టయోటా సాంకేతిక సహకారం అందించనుంది. ఎలక్ట్రిక్ వాహనాలకు ఊతమిచ్చే చర్యలను కేంద్రప్రభుత్వం తీసుకుంటున్న నేపథ్యంలో ఈ రెండు కంపెనీలు చేతులు కలపటం ప్రాధ్యాన్యత సంతరించుకొంది. ఎలట్రిక్ వాహనాల వినియోగాన్ని భారత్ లో పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర అధ్యయనం చేయనున్నట్లు ఇరు కంపెనీలు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి. చార్జింగ్ స్టేష్టన్లు, విక్రయానంతర సర్వీసుల కోసం టెక్నీషియన్లకు శిక్షణ ఇవ్వటం మెదలైన కార్యకలాపాలపై దృష్టి సారించనున్నట్లు వివరించారు ఆ సంస్థ ప్రతినిధులు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy