మన వాటా కోసమే గోదావరిలో రీడిజైనింగ్ : సీఎం

ING-170116-HYD-CMIRRGATIONRVW 00003608రాష్ట్రంలో ప్రాజెక్టుల రీడిజైన్ ఎందుకు చేపట్టారో త్వరలో ప్రజలకు చెప్పేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీని కోసం సమగ్ర నివేదిక తయారు చేయాలని సంబంధిత శాఖ అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. గోదావరిలో మన వాటా ప్రకారం నీటిని సమర్థంగా, సంపూర్ణంగా వాడుకోవడానికే ప్రాజెక్టుల రీడిజైనింగ్. ప్రాజెక్టుల రీడిజైనింగ్‌పై ప్రజలకు పూర్తి వివరాలు తెలుపాలన్నారు. ఇందుకోసం అధికారులు పూర్తి నివేదిక తయారు చేయాలని సూచించారు.  గోదావరి, కృష్ణా నదులపై కొత్తగా నిర్మించే ప్రాజెక్టులకు వెంటనే టెండర్లు పిలవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం కేసీఆర్. ఇప్పటికే అభివృద్ధి దశలో ఉన్న ప్రాజెక్టుల పనులు కూడా వెంటనే పూర్తి చేయాలన్నారు. అన్ని ప్రాజెక్టులకు సంబంధించిన పనులు ఏకకాలంలో జరగాలన్నారు. సమైక్య పాలనలో తెలంగాణ ప్రయోజనాలను ఏ మాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రాజెక్టు ముందుకు పోవద్దనే తమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత – చేవెళ్లకు డిజైన్ చేశారన్నారు. అప్పుడు తమ్మిడిహట్టి దగ్గర  ప్రాజెక్టు కట్టాలన్నది వ్యాప్కోస్ ప్రతిపాదన కాదు. అప్పటి ప్రభుత్వ ఒత్తిడి మాత్రమేనని తెలిపారు.  గోదావరి ప్రధాన నదిపై కాకుండా ఉపనది ప్రాణహితపై ప్రాజెక్టు కట్టాలనుకోవడమే ఆశ్చర్యంగా ఉందన్నారు. ఈ విషయాన్ని ప్రజలకు తెలపాలన్నారు. మేడిగడ్డ దగ్గర నిర్మించే కాళేశ్వరం ప్రాజెక్టుపై మహారాష్ట్ర ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉందన్నారు  సీఎం. ఆ రాష్ట్ర సీఎంతో పాటు ఆ రాష్ర్టానికి చెందిన సీనియర్ నేతలు, కేంద్రమంత్రులు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు పట్ల ఆసక్తిగా ఉన్నారు. ఉద్యమ సమయంలో కాళేశ్వరంలోని దేవాలయంలో మొక్కులు మొక్కాను. మొక్కులు చెల్లించి ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభిస్తామన్నారు.  తమ్మిడిహట్టి దగ్గర ప్రాణహితపై బ్యారేజ్ నిర్మించి ఆదిలాబాద్ జిల్లాలో 2 లక్షల పది వేల ఎకరాలకు సాగునీరందిస్తాని తెలిపారు సీఎం కేసీఆర్. అందుకు సంబంధించిన బ్యారేజ్, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల నిర్మాణం కోసం వ్యాప్కోస్‌తో సర్వే చేయించాలని నిర్ణయంతీసుకున్నామన్నారు.

పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించే నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన రిజర్వాయర్ల పనులను రెండేళ్లలో పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సూచించారు. ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే ఉద్దేశంతో చేపట్టిన రాజీవ్‌సాగర్, ఇందిరా సాగర్ ఏకీకరణ ప్రాజెక్టుకు సంబంధించిన పనులను ఖరారు చేశామన్నారు . ఇందుకు వెంటనే టెండర్లు పిలవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రోళ్లపాడు, బయ్యారం రిజర్వాయర్ల ద్వారా జిల్లాలో కొత్తగా 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందివ్వాలన్న సీఎం కేసీఆర్… ఆ పనులకు వెంటనే టెండర్లు పిలవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy