మన వారసత్వ సంపద.. చేనేత పరిశ్రమ

amrapalమన వారసత్వ సంపదైన చేనేత పరిశ్రమను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు జిల్లాల అధికారులు, నేతలు. పరిశ్రమను ఆదుకునేందుకుఅందరూ వారంలో ఒకరోజు చేనేత బట్టలనే వేసుకోవాలన్నారు. తమతోపాటు.. తమ కుటుంబం.. బంధు మిత్రులతో కూడా చేనేత బట్టలను వాడేలాగా చూడాలన్నారు.

వరంగల్ అర్భన్ జిల్లాలో జాతీయ చేనేత వేడుకలను ఘనంగా నిర్వహించారు. హన్మకొండ పబ్లిక్ గార్డెన్ లోని నేరేళ్ల వేణుమాదవ్ ఆడిటోరియంలో చేనేత ఎగ్జిబిషన్ ను జిల్లా కలెక్టర్ అమ్రపాలీ, సీపీ సుధీర్ బాబు ప్రారంభించారు.  సోమవారం (ఆగస్టు7)న అధికారులంతా చేనేత బట్టలే వేసుకుని … కార్యక్రమంలో పాల్గొన్నారు. చేనేత పరిశ్రమకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు ప్రభుత్వం పనిచేస్తోందన్నారు కలెక్టర్.  వారంలో ఒకరోజైనా ప్రజలు చేనేత బట్టలు వాడాలని కోరారు.

చేనేత కార్మికులకు అండగా ఉండేందుకు ప్రభుత్వ ఉద్యోగులంతా  వారంలో ఒకరోజు నేత బట్టలను ధరించాలన్నారు రాజన్న సిరిసిల్ల కలెక్టర్ కృష్ణభాస్కర్. చేనేత దినోత్సవం సందర్భంగా కార్మికులను ఘనంగా సన్మానించారు. కలెక్టరేట్ ఆఫీసులో చేనేత బట్టల షాపును ఏర్పాటు చేశామన్నారు. అంతకుముందు నేతన్నలతో కలిసి జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు.

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో జాతీయ చేనేత దినోత్సవం ర్యాలీని నిర్వహించారు  అధికారులు, నేతలు. ప్రతొక్కరూ చేనేత బట్టలే వాడి… నేతన్నలకు సాయపడాలన్నారు.  గద్వాల చీరలకు డిమాండ్ బాగా ఉందని..ఇక్కడ హ్యాండ్లూమ్ పార్క్ అభివృద్దికి చర్యలు తీసుకుంటమన్నారు జిల్లా కలెక్టర్ రజత్ కుమార్ షైనీ.

చేనేత రంగానికి ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా చేనేత జౌళిశాఖ అధికారి పరమేశ్వర్. చేనేతను  కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది చేనేత మీదనే ఆధారపడి ఉన్నారని…దీంతో నేతన్నలను ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. తర్వాత నేతన్నలతో కలిసి ర్యాలీ పాల్గొన్నారు.

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా… మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తా నుంచి కాలేజీరోడ్ వరకు ర్యాలీ నిర్వహించారు నేత కార్మికులు. ర్యాలీని ఎమ్మెల్యే దివాకర్ రావుతో కలిసి ప్రారంభించారు జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణణ్. గత ప్రభుత్వాలు నేత కార్మికులను పట్టించుకోలేదని….దీంతో నేతన్నల ఆత్మహత్యలు జరిగాయన్నారు. ప్రభుత్వం నేత కార్మికులకు సబ్సిడీ రుణాలు మంజూరు చేస్తోందని తెలిపారు.

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చేనేత దినోత్సవాన్ని నిర్వహించారు అధికారులు. ఆఫీసర్స్ క్లబ్ లో మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ప్రజలకు చేనేత బట్టలపై  అవగాహన కల్పించారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy