మన విద్యుత్ అవసరాలకు చంద్రుడు

moon-475అంతరిక్ష ప్రయోగాల్లో ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది ఇస్రో. తక్కువ వనరులతో ఎక్కువ ఫలితాలను అందిస్తున్న సంస్థగా కీర్తి సంపాదించుకుంది. తాజాగా చంద్రుడిపై ఉండే ఇంధన వనరులను వినియోగించుకోవడానికి రెడీ అవుతోంది. చందమామపై ఉన్న హీలియం – 3ని విద్యుత్ అవసరాలకు ఉపయోగించుకోవచ్చని తెలుపుతున్నారు ఇస్రో చైర్మన్ శివథాను పిళ్లై. చంద్రుడి పై నుంచి భూమికి తీసుకొచ్చే  మిషన్ ను 2030కల్లా పూర్తి చేస్తామని తెలిపారాయన. భారతదేశ అవసరాలకు అనుగుణంగా హీలియం-3ని ఉపయోగించుకోవచ్చని తెలిపారు. అబ్జర్వ్ రీసెర్చ్ ఫౌండేషన్ నిర్వహించిన ‘కల్పనా చావ్లా స్పేస్ పాలసీ డైలాగ్’ సదస్సులో పాల్గొన్న ఆయన ఈ విషయం చెప్పారు. చంద్రుడిపై పరిశోధనల్లో మిగతా ప్రపంచం కంటే మనం ముందున్నామన్నారు పిళ్లై.

హీలియం ఉపయోగాలు: 

  • ఉపగ్రహాల్లోని పరికరాలను శీతలంగా ఉంచడానికి, రాకెట్‌ ఇంజిన్లను శభ్రం చేయడానికి, వాహకనౌకల్లోని ఆక్సిజన్‌, హైడ్రోజన్‌లను చల్లబరచడానికి అంతరిక్ష పరిశ్రమలో ఉపయోగిస్తారు.
  • బిగ్‌ బ్యాంగ్‌ యంత్రమైన లార్జ్‌ హాడ్రన్‌ కొలైడర్‌లోనూ శీతల మాధ్యమంగా ఈ వాయువును ఉపయోగిస్తారు.
  • వైద్యానికి వాడే ఎమ్మారై స్కానర్లలోని సూపర్‌ కండక్టింగ్‌ అయస్కాంతాలను చల్లబరచడానికీ వాడతారు.
  • వాతావరణ పరిశోధనకు ఉపయోగించే బెలూన్లు, ఎయిర్‌షిప్‌లో ఉపయోగిస్తున్నారు.
  • దుకాణాల్లో బార్‌కోడ్‌లను స్కాన్‌ చేయడానికి హీలియం-నియాన్‌ గ్యాస్‌ లేజర్లనువాడుతున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy