మరింత జోష్ : 22న ఉమెన్స్ IPL

WOMENచీర్ గాళ్స్ చిందులు..సిక్సర్ల మోత..బౌండరీల బాదుడు క్రికెట్ అభిమానుల్ని ఉత్సహపరిచే IPL ..ఇప్పుడు ఉమెన్స్ క్రికెట్ లోనూ రానుంది. 11 సంవత్సరాల్లో సీజన్ కు రెట్టింపు జోష్ తో ముందుకెళ్తున్న IPL కి మంచి రెస్పాన్స్ రావడంతోనే..ఇప్పుడు ఉమెన్స్ IPL తీసుకురావడానికి ముందుకు వచ్చింది BCCI. ఈ క్రమంలోనే మహిళా క్రికెటర్లకు IPL నిర్వహించాలన్న ప్రతిపాదన దిశగా చిన్న అడుగు పడింది. మే 22న ముంబై లో IPL ప్లేఆఫ్‌ కు ముందు ప్రయోగాత్మకంగా మహిళలకు ఎగ్జిబిషన్‌ టీ20 మ్యాచ్‌ ను నిర్వహించనుంది BCCI. ఈ మ్యాచ్‌ కోసం 20 మంది భారత మహిళా క్రికెటర్లతో పాటు పది మంది విదేశీయులు ప్రాక్టీస్ చేయబోతున్నారు. వీరి నుంచి రెండు టీమ్స్ ను తయారు చేస్తారు. ఒక టీమ్ IPL ఎలెవన్‌ కాగా.. మరొకటి BCCI ఎలెవన్‌. IPL లో మాదిరే ఒక్కో జట్టులో ఏడుగురు ఇండియన్స్ , నలుగురు విదేశీయులు ఉంటారు. 22న మధ్యాహ్నం 2.30 నిమిషాలకు ఈ మ్యాచ్‌ ప్రారంభమవుతుంది. స్టార్‌ స్పోర్ట్స్‌ ఈ మ్యాచ్‌ ను ప్రసారం చేయనుంది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లాండ్‌ బోర్డుల్ని సంప్రదించి ఈ మ్యాచ్‌ లో పాల్గొనే విదేశీ క్రికెటర్ల పేర్లను ప్రకటించనుంది BCCI. భారత అమ్మాయిల వివరాలను త్వరలోనే వెల్లడిస్తుంది సెలక్షన్ కమిటి.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy