గ్రూప్ – 2 నోటిఫికేషన్ విడుదల

tspsclogoగ్రూప్‌-2 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది టీఎస్‌పీఎస్‌సీ. మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్-III లో 19 పోస్టులు, ఏసీటీవో-110 పోస్టులు, ప్రొహిబిషన్, ఆబ్కారీ శాఖ ఎస్సై-220 పోస్టులు, సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్-II లో 23 పోస్టులు, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి ఎక్స్ టెన్షన్ ఆఫీసర్-67 పోస్టులకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. డిసెంబర్ 31 నుంచి ఫిబ్రవరి 9వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు . ఏప్రిల్ 24, 25న గ్రూప్-2 ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.

 

టీఎస్‌పీఎస్‌సీ ద్వారా మరో 357 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అగ్రికల్చర్ ఎక్స్ టెన్షన్ గ్రేడ్-II లో 311 పోస్టులు. రేపటి నుంచి జనవరి 25 వరకు దరఖాస్తుల స్వీకరణ, మార్చిలో ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డులో టెక్నీషియన్ గ్రేడ్-II లో 44 పోస్టులు. రేపటి నుంచి జనవరి 28 వరకు దరఖాస్తుల స్వీకరణ, మార్చిలో ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు తెలిపారు, హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డులో డిప్యూటీ జనరల్ మేనేజర్(ఫైనాన్స్)-2 పోస్టులు. రేపటి నుంచి జనవరి 22 వరకు దరఖాస్తుల స్వీకరణ, ఫిబ్రవరి 21న ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.

డిసెంబర్ 31 నుంచి www.tspsc.gov.in వెబ్ సైట్ లో నోటిఫికేషన్ పూర్తి వివరాలు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy