మరుగుజ్జు గా బాలీవుడ్ కండలవీరుడు…

salman-biggboss62012బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కమల్ ను అనుసరించాలని డిసైడ్ అయ్యాడు. విచిత్రసోదరులు లో కమల్ మరుగుజ్జు పాత్రలో నటించాడు. అలాగే ఇప్పడు సల్మాన్ ఖాన్ ఓ సినిమా కోసం మరుగుజ్జు అవతారం ఎత్తనున్నాడు. తనూ వెడ్స్ మను, రాంజానా సినిమాల దర్శకుడు ఆనంద్ ఎల్.రాయ్ తీస్తున్న కొత్త మూవీలో సల్మాన్ మరుగుజ్జులా కనిపిస్తాడుట. మరుగుజ్జు పాత్రకు సంబంధించి ఆనంద్ చెప్పిన కథ ఈ హీరోకు బాగా నచ్చిందిట. ఎప్పటినుంచో ప్రయోగాత్మక సినిమాల్లో చేయాలని అనుకుంటున్న సల్మాన్ ఇందులో యాక్ట్ చేయడానికి వెంటనే పచ్చ జెండీ ఊపేశారని సమాచారం. అంతేకాదు ఈ మూవీకి సల్మాన్ కో ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించాలని నిర్ణయించుకున్నారని సమాచారం.

కమల్ తర్వాత చాలా మంది మరుగుజ్జు పాత్రల్లో నటించినా అంతగా ప్రేక్షకులను మెప్పించలేకపోయారు. మరి ఇప్పడు సల్మాన్ ఖాన్ ఈ పాత్రలో బాలీవుడ్ జనాలను ఎంత వరకు శాటిస్ఫై చేస్తారో చూడాలి.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy