మనోరమ ఇక లేరు

_86058046_151010215438_manoramaఎన్నో అద్భుతమైన పాత్రలతో దాదాపు 5 దశాబ్దాలుగా సినీ అభిమానులను అలరిస్తున్న అత్యుత్తమ నటి అశేష అభిమానులను వదిలి వెళ్లిపోయింది. తమిళ, తెలుగు, మళయాళ, కన్నడ, హిందీ భాషల్లో సుపరిచితురాలైన సీనియర్ నటి మనోరమ శనివారం అర్ధరాత్రి కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.

 

  • search1960, 1970 దశకాలలో తమిళ వెండితెరను శాసించిన మనోరమ 1937  మే 26న తమిళనాడులోని మన్నార్‑గుడిలో జన్మించారు
  •  మనోరమ అసలు పేరు గోపిశాంత
  •  12 ఏళ్ల చిన్న వయసులోనే నాటకరంగంలోకి అడుగుపెట్టిన ఆమె స్టేజ్ ఆర్టిస్ట్ గా ఎంతో గుర్తింపు
  • కరుణానిధి రాసిన ఎన్నో నాటకాలల్లో నటించారు.
  • 1958లో రిలీజ్ అయిన మళ ఇట్ట మంగై సినిమాతో తొలిసారిగా వెండితెర మీద కనిపించారు
  • 1963లో వచ్చిన కొంజమ్ కుమారి సినిమాలో హీరోయిన్‑గా నటించినా తరువాత కూడా కామెడీ పాత్రల మీదే దృష్టిపెట్టారు
  •  రెండు దశాబ్దాల పాటు తమిళ ఇండస్ట్రీలో ఆమె లేకుండా ఒక్క సినిమా కూడా రాలేదంటే అతిషయోక్తి కాదు
  •  స్టార్ హీరోల సినిమాల నుంచి చిన్న హీరోల సినిమాల వరకు ఏ స్థాయి సినిమా అయిన అందులో మనోరమ కోసం ప్రత్యేకంగా ఓ పాత్రను రాసేవారు
  •  అలనాటి మేటి నటులు చంద్రబాబు, చో రామస్వామి, తంగవేళు, తెంగై శ్రీనివాసన్, ఎమ్ ఆర్ రాధ, నగేష్ లాంటి సీనియర్ నటులతో కలిసి ఎన్నో సినిమాల్లో హాస్యాన్ని పండిచారు
  • తమిళనాడు సీఎంలు అన్నాదురై, కరుణానిధి, ఎమ్ జి రామ్‑చంద్రన్, జయలలితలతో ఆమె కలిసి నటించారు
  • తెలుగు సినిమాలు: అల్లరి ప్రియుడు, కుంతీ పుత్రుడు, జెంటిల్‑మేన్‑, రిక్షావోడు, బావనచ్చాడు, అరుంధతి
  • తమిళనాడు ప్రభుత్వం కలైమామణి అవార్డ్ తో సత్కరించగా,  భారత ప్రభుత్వం 2002లో పద్మ శ్రీ అవార్డ్ తో గౌరవించింది
  •  1988లో ఆమె నటించిన పుతియా పట్టై సినిమాకు గాను ఉత్తమ సహాయ నటిగా జాతీయ అవార్డ్
  • తెలుగు, తమిళ రాష్ట్ర ప్రభుత్వాల అవార్డులు, ఫిలింఫేర్ అవార్డ్ లు ఎన్నో అందుకున్నారు

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy