మరోసారి గెలిపిస్తే అద్భుతం చేస్తా : మాజీ స్పీకర్ మధుసూదనాచారి

భూపాలపల్లి: నాలుగున్నరేళ్ల క్రితం అనేక సమస్యలతో ఉన్న భూపాలపల్లి పట్టణాన్ని ఎంతో అభివృద్ధి చేశానని, మరోసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే అద్భుతమైన పట్టణంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు శాసనసభ మాజీ స్పీకర్ మధుసూదనాచారి. నిన్న(సోమవారం) భూపాలపల్లి పట్టణంలోని 13వ వార్డులోని రాంనగర్, సుభాష్‌కాలనీ, గాంధీనగర్‌ కాలనీల్లో టీఆర్ ఎస్, టీబీజీకేఎస్‌ నాయకులు, మహిళలు ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాంనగర్‌కాలనీలో మధుసూదనాచారికి మహిళలు కోలాటాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన‌ మాట్లాడుతూ భూపాలపల్లిని జిల్లా కేంద్రంగా మార్చడం వల్ల స్థానికంగా ఉన్న భూముల విలువ రెట్టింపు స్థాయిలో పెరిగిందన్నారు. గతంలో భూపాలపల్లి ప్రాంతంలో ఇళ్లు నిర్మించుకునేందుకు అసలే ఇష్టపడని వారు నేడు ఇతర జిల్లాలకు చెందిన వారు కూడా ఇక్కడ ఇళ్లు నిర్మించుకోవాలని ముందుకు వస్తున్నారంటే దీనికి కారణం జిల్లా కేంద్రంగా ఏర్పడటమేనన్నారు. మరోసారి ప్రజలు ఆదరించి నన్నుగెలిపిస్తే అత్యధికంగా అభివృద్ధి నిధులు మంజూరు చేసి, ఇతర పట్టణాల కంటే భూపాలపల్లిని ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు మాజీ స్పీకర్‌.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy