మరో అద్భుతం: అంతరిక్షంలోకి సూపర్‌ కంప్యూటర్‌

issఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు (ISS) సూపర్‌ కంప్యూటర్‌ను పంపేందుకు ఏర్పాట్లు చేపట్టారు సైంటిస్టులు. ఫాల్కన్‌ 9 రాకెట్‌ను స్పేస్‌ఎక్స్‌ ప్రయోగించనుంది. మానవరహిత కార్గోషిప్‌లో దీన్ని ISS కు పంపనున్నారు.

ఈ సూపర్‌ కంప్యూటర్‌ ISS లో వ్యోమగాములకు భవిష్యత్‌ ప్రయోగాలపై మార్గనిర్దేశనం చేయనుంది. ఫ్లోరిడాలోని కేప్‌ కానవెరల్‌ నుంచి సోమవారం (ఆగస్టు14) ఈ రాకెట్‌ ప్రయోగం చేపట్టనున్నారు. ప్రయోగానికి వాతావరణం 70 శాతం అనుకూలంగా ఉన్నట్లు సమాచారం. ఒకవేళ వాతావరణం అనుకూలించకపోతే ఈ ప్రయోగాన్ని వచ్చే వారానికి వాయిదా వేయనున్నట్లు స్సేస్‌ఎక్స్‌ ప్రతినిధులు తెలిపారు.

హెచ్‌పీ ఎంటర్‌ప్రైజెస్‌ ఈ సూపర్‌కంప్యూటర్‌ను రూపొందించింది. స్పేస్‌బార్న్‌ కంప్యూటర్‌గా పిలిచే ఈ సూపర్‌కంప్యూటర్‌ని ISS లో సంవత్సరం పాటు పరీక్షించనున్నారు. భారరహిత స్థితిలో ఇది ఎలా పనిచేస్తుందో పరిశీలించనున్నారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy