మరో త్యాగానికి రెడీనా : రైల్వే రాయితీని తిరిగి ఇచ్చేద్దామా!

railwayఊరు మనకు ఎంతో ఇచ్చిది.. తిరిగి ఇచ్చేయాలి.. లేకపోతే లావయిపోతాం. ఏ ముహూర్తాన ఈ డైలాగ్ పుట్టిందోగానీ.. ఇప్పుడు మోడీ సర్కార్ కి ఇది పెద్ద స్కీమ్ అయ్యి కూర్చుంది. మొన్నటికి మొన్న గ్యాస్ సబ్సిడీ ఇచ్చేద్దాం అంటూ కొత్త స్కీమ్ తీసుకురాబోతున్నది. ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి రైల్వే రాయితీ GIVE IT UP అమలు చేస్తోంది రైల్వే శాఖ. రైల్వే టికెట్ ధరలు – వాస్తవ ఖర్చు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. వాస్తవానికి మీరు రైల్లో 10కిలోమీటర్లు ప్రయాణం చేస్తే 10 రూపాయలు రైల్వే శాఖ ఖర్చు చేస్తోంది. టికెట్ మాత్రం ఆరు రూపాయలుగానే ఉంటుంది. అంటే నాలుగు రూపాయలు రాయితీ, సబ్సిడీగా భరిస్తుంది. ఈ విధంగా ప్రతి ఏటా రైల్వే శాఖ 30వేల కోట్ల రూపాయలు భరిస్తుంది.

రైల్వే శాఖకు ఈ ఐడియా ఓ ప్రయాణికుడు ద్వారా పుట్టింది. ఫరీదాబాద్ కు చెందిన అవతార్ క్రిష్ణన్ ఖేర్ అనే వ్యక్తి ఢిల్లీ నుంచి ముంబైకి రాజధాని ఎక్స్ ప్రెస్ లో ప్రయాణించాడు. వాస్తవ ధర కంటే అతనికి 950 రూపాయలు తక్కువకే జర్నీ చేశాడు. ఈ వివరాలు తెలుసుకున్న అవతార్.. రైల్వే శాఖకు చెక్కు రూపంలో 950 తిరిగి పంపించాడు. ఇదేదో బాగుందని భావించిన కేంద్ర మంత్రి ప్రభు.. వెంటనే అమల్లోకి తీసుకొచ్చేస్తున్నాడు. ఆగస్ట్ ఒకటి నుంచి ఇది అమలు కాబోతున్నది. అందరికీ కాదులేండీ.. మీ ఇష్టం అయితేనే. లేకపోతే లేదు. ముందుగా ఆన్ లైన్ లో ఆప్షన్స్ రూపంలో ప్రవేశపెడుతున్నారు.

ఆన్ లైన్ లో ఎలాగంటే..

మీరు IRCTC (ఆన్ లైన్ బుకింగ్)లో మీరు టికెట్ బుక్ చేసుకునే సమయంలో మీకో ఆప్షన్ వస్తుంది. ఓకే అని క్లిక్ చేయగానే.. 100శాతమా.. 50శాతమా అని వస్తుంది. మీరు ఎంతయితే రాయితీని వదులుకోవాలి అనుకుంటారో అక్కడ క్లిక్ చేస్తే.. మీ టికెట్ రేటు ఫైనల్ అవుతుంది. మొదటిగా ఆన్ లైన్ లో ప్రారంభం అయ్యే ఈ స్కీమ్ ను.. చాలా వేగంగా కరెంట్ టికెట్ బుకింగ్ కు అమలు చేయటానికి సన్నాహాలు చేస్తోంది రైల్వే శాఖ. రైల్వే మనకు చాలా ఇచ్చింది.. మనం కూడా తిరిగి ఇచ్చేద్దామా..

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy