మరో రెండు రోజులు భారీ వర్షాలు

rainఈశాన్య బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనంలో కోస్తాపై ఆవరించిన ఆవర్తనం విలీనమై ఉత్తర ఒడిశా పరిసరాల్లో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో వచ్చే మూడు రోజుల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనంగా ఏర్పడిన తర్వాత ఇది పశ్చిమ దిశగా పయనిస్తుందని, దీంతో ఒడిశా, ఉత్తర కోస్తా, ఛత్తీస్ గఢ్‌, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, విదర్భల్లో వచ్చే మూడు, నాలుగు రోజుల వరకు విస్తారంగా, అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోవైపు బీహార్‌ నుంచి ఉత్తర కోస్తా వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఈ రెండింటి ప్రభావంతో రుతుపవనాలు చురుగ్గా మారి కోస్తా, రాయలసీమ, తెలంగాణలో అనేకచోట్ల వర్షాలు కురిశాయి.

రుతుపవనాలు ఊపందుకోవడంతో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ఆదివారం (ఆగస్టు27), సోమవారాల్లో( ఆగస్టు28) వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడా భారీ వర్షాలు నమోదవుతాయని తెలిపింది. తర్వాత రెండు మూడు రోజుల పాటు తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నట్లు తెలిపారు.

గత 24 గంటల్లో సదాశివనగర్ లో 12 సెంటీ మీటర్లు, హైదరాబాద్,హకీంపేటల్లో11 సెంటీమీటర్ల చొప్పున భారీ వర్షపాతం నమోదైంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy