మరో వారం రోజులు వణకాల్సిందే..!

cold in telangnaతెలుగు రాష్ట్రాల్లో చలి చంపేస్తోంది. తెల్లవారుజామున లేవడానికే భయపడుతున్నారు జనం. రోజురోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలతో జనం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇది మరికొన్ని రోజులు కొనసాగనుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వాయవ్య దిశ నుంచి వీస్తున్న గాలుల ఫలితంగా చలి పెరిగిందని, దీని ప్రభావం మరో వారం రోజుల వరకు ఉండనుందన్నారు.

 

గజగజ వణుకుతున్న విశాఖ మన్యం

విశాఖ మన్యంలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఆదివారం ఉదయం లంబసింగిలో 4, చింతపల్లిలో 6, మినుములూరులో 7, పాడేరులో 8డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యింది. వాయువ్యదిశ నుంచి వీస్తున్న గాలుల ఫలితంగా చలి పెరిగిందని, దీని ప్రభావం మరో వారం రోజుల వరకు ఉండనుందని తెలిపారు విశాఖ వాతావరణకేంద్రం అధికారులు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy