మరో సారి రాజ్యసభ వాయిదా

download (2)
ఉదయం నుంచి రాజ్యసభ 10 సార్లు వాయిదా పడుతూ వస్తుంది. సభలో సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ సీమాంధ్ర ఎంపీలు నినాదాలు చేస్తున్నారు. వీరితో పాటు తమిళనాడుకు చెందిన ఎంపీలు కూడా జాలర్ల సమస్యలు పరిష్కరించాలని దాని గురించి సభలో చర్చ జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సభ ఆర్డర్ లోకి రాకపోవడంతో స్పీకర్ రాజ్యసభను 15 నిమిషాలు వాయిదా వేశారు.
సభను సజావుగా నడపాలని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారు. తెలంగాణకు పూర్తిగా మద్ధతు తెలుపుతున్నామని, అయితే సీమాంధ్ర సమస్యలు కూడా పరిష్కరించాలని వెంకయ్య కోరారు. 4గంటలకు సభ వాయిదా పడ్డ సమయంలో కురియన్ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో అన్ని పక్షాల వారి నుంచి బిల్లుపై చర్చ చేయాలని నిర్ణయానికి వచ్చారు. కాంగ్రెస్ సభ్యులే సభలో గందరగోళం చేస్తున్నారని మండిపడ్డారు.
బిల్లుకు సహకరించాలని కురియన్ సభ్యులను కోరినా వారు ఆందోళనలు కోనసాగించడంతో డిప్యూటి చైర్మన్ సభను వాయిదా వేశారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy