మర్యాద మారింది : గుడ్ మార్నింగ్ కాదు.. స్వచ్ఛ నమస్కారం

GUDMAORNINGస్వచ్ఛ హైదరాబాద్ సాధనలో భాగంగా దీనిపై మరింత చైతన్యం తీసుకొచ్చేలా GHMC ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇక నుంచి జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బంది అందరూ గూడ్‌ మార్నింగ్‌కు బదులుగా ‘స్వచ్ఛ నమస్కారం’ అని చెప్పాలని కమిషనర్‌ బి.జనార్దన్‌రెడ్డి ఆదేశించారు. స్వచ్ఛ హైదరాబాద్‌ పై మరింత చైతన్యం కలిగించేందుకు చేపట్టిన పలు చర్యల్లో భాగంగా ప్రతిఒక్కరూ ముఖ్యంగా GHMC ఉద్యోగులు, అధికారులు వివిధ పనుల నిమిత్తం ఆఫీసులకు వచ్చే వారిని స్వచ్ఛ నమస్కారం అని పలకరించాలని స్పష్టం చేశారు. నగరంలో చెత్తను తడి, పొడిగా  విడదీసి GHMC గార్బేజ్‌ కలెక్టర్‌కు అందించాలని పేర్కొంటూ మొబైల్‌ ఫోన్‌ రింగ్ టోన్ విడుదల చేశారు. ఈ రింగ్‌టోన్‌ ప్రారంభం కూడా స్వచ్ఛ నమస్కారం అని మొదలవుతుంది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy