మలాలాకు న్యాయం జరగలేదు

malalaపాకిస్థాన్ సాహస బాలిక, నోబెల్ శాంతి బహుమతి విజేత మలాలా యూసుఫ్ జాయ్ కు ఆ దేశ కోర్టులు న్యాయం చేయలేకపోయాయి. ప్రాణాలకు తెగించి తీవ్రవాదులతో ధైర్యంగా పోరాడిన మలాలా ధీరత్వాన్ని పూర్తిగా గాలికొదిలేశాయి. ఆమెపై దాడి చేసినవారిని శిక్షించకుండా వదిలిపెట్టి మలాలాను అవమానించాయి.

2012లో మలాలాపై దాడి చేసిన 10మందిలో 8మందిని పాకిస్థానీ కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది. వీరంతా… ఏ తప్పు చేయలేని కోర్టు… తీర్పునిచ్చింది. అటాక్ లో ఈ 8మంది పాత్రపై ప్రాసిక్యూషన్ సరైన ఎవిడెన్స్ సబ్మిట్ చేయలేకపోవడంతో కోర్టు వారిని నిర్దోషులుగా ప్రకటించింది. మిగతా ఇద్దరికీ మాత్రం 25ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే… శిక్ష పడకుండా విడుదలైనవారు కూడా… దాడిలో పాల్గొన్నట్టు… ప్రాసిక్యూషన్ వాదించినా లాభం లేకపోయింది. అయితే ప్రూఫ్స్ లేకపోవడమే… తమకు న్యాయం జరగలేదని ప్రాసిక్యూషన్ తరపు లాయర్లు చెప్పారు. ఆడపిల్లలు చదువుకోవద్దన్న తాలిబన్ల… హెచ్చరికలను పట్టించుకోకుండా… స్కూలుకెళ్లిన మలాలపై 2012లో దాడి జరిగింది. స్కూల్ కు వెళ్తుండగా జరిగిన దాడిని ఆమె ఎదుర్కొంది. దీంతో మాలాలా డేరింగ్ కిడ్ గా వాల్డ్ వైడ్ గా పాపులర్ అయింది. అదే స్పూర్తితో ఆడపిల్లలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఉద్యమకారిణిగా మారింది. తాజాగా 2014లో నోబెల్ శాంతి పురస్కారం కూడా అందుకుంది.

కేసులో 8 మందిని సీక్రెట్ గా రిలీజ్ చేశారు. మే 18 అప్పీల్ వచ్చినా… అంతకు ముందే ఏప్రిల్ 30నే వాళ్లను విడిచిపెట్టినట్టు అక్కడి మీడియా రిపోర్ట్ చేసింది. మొత్తంగా… ఇంటర్నేషనల్ వైడ్ గా… ఎంత పాపులారిటీ, సాలిడారిటీ సంపాదించుకున్నా… తన దేశంలోనే మలాలాకు న్యాయం జరగలేదు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy