మలాలాకు బాలల నోబెల్?

malaనోబెల్ ప్రైజ్ ఇవ్వడం చూసుంటాం. కానీ చిల్డ్రన్స్ నోబెల్ ప్రైజ్ ను ఎక్కడైనా ఎవరికైనా ఇవ్వడాన్ని చూసుండం. తాజాగా ఈ జాబితాలో చోటు సంపాదించుకుంది పాకిస్థాన్ కు చెందిన బాలల హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్ జాయ్. పాకిస్థాన్ కు చెందిన మలాలా చిన్నతనంలోనే బాలల హక్కుల కోసం పోరాడిన మలాలా పేరును ఈ ఏడాది చిల్డ్రన్స్ నోబెల్ కు నామినేట్ చేశారు. బాలల హక్కుల కోసం తాలిబన్ల చేతిలో తీవ్రంగా గాయపడిన ఆమెతో పాటు మరో ఇద్దరు ఈ టైటిల్ కు పోటీ పడుతున్నారు.గాయాల నుంచి కోలుకున్నాక ఆమెకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తుంపు లభించింది. చిన్నతనంలోనే ఆమె పోరాటాలకు చాలా అవార్డులు వరించాయి. ఈ అవార్డు కూడా మలాలాకు సొంతమైతే ఆమె పేరుకు విశిష్ట గుర్తింపు లభించినట్టే.

మలాలా ప్రపంచంలోని అందరికీ స్పూర్తి అంటూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబాబా కొనియాడారు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy