మల్కాపురం శివకే సింగం – 3 హక్కులు

surya-singam-3తమిళంతో పాటు తెలుగులో కూడా స్టార్ ఇమేజ్‌ను దక్కించుకున్న ప్రముఖ కథానాయకుడు సూర్య నటిస్తున్న తాజా చిత్రం సింగం-3. గతంలో వచ్చిన సింగం, సింగం-2 చిత్రాలు ఘనవిజయాలు సాధించిన సంగతి తెలిసిందే. సింగం సిరీస్‌లో భాగంగా హరి దర్శకత్వంలో తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న  సీక్వెల్ సింగం – 3 పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అంచనాలకు తగినట్లుగానే ఈ చిత్రం తెలుగు హక్కులకు భారీ పోటీ నెలకొంది. అయితే ఈ చిత్రం తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా అధినేత మల్కాపురం శివకుమార్ ప్యాన్సీ రేటుతో దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన చిత్ర విశేషాలను తెలియజేస్తూ  తొలినుంచి మా సంస్థలో వైవిధ్యమైన చిత్రాలను అందించాలను భావనతోనే ఇటీవల సూర్య వర్సెస్ సూర్య, శౌర్య చిత్రాలను నిర్మించాను. ఇప్పుడు తాజాగా సూర్య ప్రతిష్టాత్మక చిత్రం సింగం – 3ను తెలుగు హక్కులను దక్కించుకోవడం ఆనందంగా ఉంది. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా పతాకంపై ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నాను. తెలుగు నేటివిటికి దగ్గరగా వుండే ఈ చిత్ర నేపథ్యంలో తెలుగు ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలుంటాయి. వైజాగ్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఈ చిత్రం షూటింగ్‌లో అధికభాగం జరగడం విశేషంగా చెప్పుకోవాలి. తప్పకుండా ఈ చిత్రం తెలుగులో అఖండ విజయం సాధిస్తుందని నమ్మకం వుంది. ప్రముఖ కథానాయికలు అనుష్క శెట్టి, శృతిహాసన్ ఈ చిత్రంలో నాయికలుగా నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాతక్మంగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం అని తెలిపారు. అనుష్క శెట్టి, శృతీహాసన్, రాధిక శరత్‌కుమార్, నాజర్, రాడాన్ రవి, సుమిత్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హేరీస్‌ జైరాజ్

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy