మల్టీ నేషనల్ కంపెనీల కోసమే పోలవరం..

nageshwar-kodandaramమల్టీ నేషనల్ కంపెనీల కోసమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందని జేఏసీ ఛైర్మన్ కోదండరాం, ఎమ్మెల్సీ నాగేశ్వర్ రావులు అభిప్రాయపడ్డారు. ఇవాళ హైదరాబాద్ లో జరిగిన టీపీటీఎఫ్ సదస్సులో మాట్లాడిన కోదండరాం.. పోలవరం ప్రాజెక్టు బహుళజాతి కంపెనీలకు లబ్ది చేకూర్చేందుకేనని అన్నారు. మల్టీ నేషనల్ కంపెనీల ఒత్తిడితోనే పోలవర్ణం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల కలిగే ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువన్నారు. 60 వేల ఎకరాలకు నీళ్లించేందుకు 3 లక్షల మందిని ముంచే ఘటన చరిత్రలో ఎక్కడా చోటుచేసుకోలేదన్నారు. ఇక ఉద్యమ సంఘాలు విచ్ఛిన్నం కాకూడదని అభిప్రాయపడ్డారు. ఉద్యమసంఘాలు విచ్ఛిన్నమైతే జార్ఖండ్ లాగే రాష్ట్రం అభివృద్ధికి దూరమవుతుందన్నారు.

ఖనిజాల దోపిడీకే పోలవరం :

పోలవరం ప్రాజెక్టు వెనుక భయంకరమైన కుట్ర ఉందన్నారు ఎమ్మెల్సీ నాగేశ్వర్. ప్రాజెక్టు నిర్మించే చోట అపారమైన ఖనిజ సంపద ఉందని, వాటిని తోడుకొని పోలవరం నీళ్లద్వారా పెద్ద పెద్ద పడవలు ఉపయోగించి విదేశాలకు తరలించేందుకు సూపర్ ప్లాన్ వేశారని అన్నారు. బడా కాంట్రాక్టర్లు, ఇండస్ట్రియలిస్టులు దీని వెనుక ఉన్నారని మండిపడ్డారు. పోలవరం ఆర్డినెన్స్ ను రద్దు చేయాలని సీఎం కేసీఆర్ శాసన మండలిలో ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని బలపరుస్తూ చేసిన ప్రసంగంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పోలవరం సమస్య రెండు రాష్ట్రాల మధ్య ఆత్మగౌరవ సమస్య కాదని, లక్షలాది మంది గిరిజనుల బతుకులకు సంబంధించిందని అన్నారు. పోలవరం నిర్మించినా తమకు అభ్యంతరం లేదని, డిజైన్ మాత్రం మార్చాలన్న తమ వాదనను కేంద్ర ప్రభుత్వం కన్సిడర్ చేయాలన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా ఇలాంటి ప్రాజెక్టులు కట్టడం మంచిది కాదన్నారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy