మళ్లీ కేసీఆరే సీఎం : అసదుద్దీన్ ఒవైసీ

తెలంగాణలో టీఆర్‌ఎస్ కచ్చితంగా అధికారంలోకి వస్తుందన్నారు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. కేసీఆరే మళ్లీ సీఎం అవుతారని కుండబద్దలు కొట్టారు. అభివృద్ధి విషయానికొస్తే దేశం మొత్తంలోనే తెలంగాణ ముందుకు దూసుకుపోతున్నదన్నారు. సంక్షేమరంగానికి దేశంలో ఏ ప్రభుత్వం చేయనంత ఎక్కువ ఖర్చుచేస్తున్న ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు ఒవైసీ.

తెలంగాణలో మైనారిటీలకు చెందిన 206 గురుకులాల్లో దాదాపు 50 వేల మంది ముస్లిం బాలబాలికలు విద్యను అభ్యసిస్తున్నారని వెల్లడించారు. షాదీముబారక్ పథకం ముస్లింలకు ఎంతో ఉపయోగపడుతున్నదన్నారు. ఇలాంటి పథకాలు ప్రజలకు నేరుగా ప్రయోజనం చేకూర్చుతాయని, అందుకే టీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని కచ్చితంగా చెప్తున్నానన్నారు ఆయన. తాము పోటీ చేయని నియోజకవర్గాల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌కే అనుకూలంగా ఉంటారని, ఈ విషయాన్ని తాము ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదన్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ 20 నియోజకవర్గాల్లో పోటీచేస్తే అందులో ఏడింట్లో గెలిచిందన్నారు. రానున్న ఎన్నికల్లో ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలనే అంశంపై అతిత్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy