మళ్లీ దేశభక్తి చాటుకున్న అక్షయ్ కుమార్

Akshay-Kumarదేశంలో చెత్త పెరిగిపోవడం.. రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారంగా కొందరు చెత్తను పడేస్తున్నారు. ఈ పద్దతులు మారాలని.. ప్రజల్లో మార్పు రావాలని.. స్వఛ్ భారత్ కార్యక్రమాన్ని ఆదర్శవంతంగా మొదలుపెట్టారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆలోచన ఆదర్శంగా ఉన్నా ఆచరణ మాత్రం అనుకున్నంత స్ధాయిలో జరగలేదు. స్వఛ్ భారత్ లో భాగంగానే బహిరంగ మల, మూత్ర విసర్జనను నిషేధించడాన్ని అమలు చేయాలనుకున్నారు. గ్రామాల్లో ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండాలని చర్యలు చేపట్టారు. గ్రామాల్లో సంగతి పక్కన పెడితే సిటీలు..టౌన్ లలోనే ప్రజలు రోడ్లపైనే మల,మూత్ర విసర్జన చేసేస్తున్నారు. పెద్ద పట్టణాల్లో ఇలా జరగడానికి కారణాలేంటా.. అని ఆలోచిస్తే బయట సులభ్ కాంప్లెక్స్ లు తక్కువగా ఉన్నాయనే చెప్పుకోవాలి. ఈ సమస్యను పరిష్కరించడానికి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కొత్త ఆలోచనతో వచ్చారు. ఇకపై ప్రతి 500 మీటర్లకు ఓ టాయిలెట్ ఉంటుందని మే 1న విద్యార్ధుల మీటింగ్ లో తన నిర్ణయాన్ని తెలియజేశారు. కోట్లు సంపాదించుకునే అవకాశం ఉన్నా కూడా అన్ని వదిలేసి తనకున్న దేశ భక్తిని ఎప్పటికప్పుడు చాటుకుంటుంన్నాడు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్. దేవేంద్ర ఫడ్నవీస్ తీసుకున్న నిర్ణయం నచ్చిన అక్కీ.. కమర్షియల్ బ్రాండ్ కాకపోయినా మంచి చేయాలన్న దృక్పధంతో ఏ డబ్బు ఆశించకుండా బ్రాండ్ అంబాసిడర్‌గా తానే ఉంటానంటూ స్వచ్ఛందంగా ముందుకొచ్చాడు. మహారాష్ట్ర ప్రభుత్వం 1.28 లక్షల మరుగుదొడ్లు కట్టించి.. టెక్నాలజీని వాడుతూ దీని కోసం ఒక ఆప్ కూడా తీసుకురాబోతున్నట్లు తెలిపారు.

 

 

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy