మళ్లీ నగదు కష్టాలు: ATM లలో నో క్యాష్ 

atm_no_cashరాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో నగదు కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. ముఖ్యంగా సంగారెడ్డి  జిల్లాలో  కరెన్సీ  కష్టాలు  జనాన్ని వెంటాడుతున్నాయి . ఎక్కడ చూసినా  ATM లలో.. నో క్యాష్  బోర్డులే  కనిపిస్తున్నాయి. దీంతో  నగదు కోసం  బ్యాంకుల  దగ్గరికి  పరుగులు  పెడుతున్నారు జనం. తెరిచిన  ఒకటో   రెండో  ATM ల  దగ్గర  డబ్బుల కోసం  క్యూ కడుతున్నారు.

ఇప్పటీకీ డబ్బులు దొరక్క…ఇబ్బందులు పడుతున్నారు జనం. చాలా వరకు ఏటీఎంలు పనిచేయడం లేదు. ఎక్కడ చూసినా నో క్యాష్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. అటు స్వైపింగ్ మిషిన్లు కూడా అందుబాటులో లేకపోవడంతో… నగదు రహిత లావాదేవీలు కూడా అంతంతమాత్రంగానే మారాయి.  ATMలలో డబ్బులు లేక…బ్యాంకుల్లో కావాల్సినంత నగదు ఇవ్వక అవస్థలు పడుతున్నారు ప్రజలు. కనీస అవసరాలైన పాలు, కూరగాయలు, నిత్యావసరాలకు కూడా డబ్బుల్లేక ఇబ్బంది పడుతున్నారు. తమ  ఖాతాల్లో డబ్బులున్నా…తీసుకోలేని పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు. ఏటీఎంలు ఎప్పుడు తెరుస్తారా అని  ఎదురుచూడాల్సి వస్తుందన్నారు. బ్యాంకుల్లోనూ నగదు నిల్వలు లేవని.. ఫలితంగా ఎప్పటికప్పుడు ఏటీఎంలలో కరెన్సీని నింపడంలేదని అంటున్నారు.

జిల్లాలో 30 వరకు ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులున్నాయి. వీటి పరిధిలో  150 వరకు ఏటీఎంలున్నాయి. అయితే ప్రస్తుతం ఎక్కడా డబ్బులు రావడంలేదు. కొన్ని ప్రాంతాల్లో ఒకటీ రెండు ఏటీఎంలు పని చేస్తున్నా… నిమిషాల వ్యవధిలోనే ఖాళీ అవుతున్నాయని చెబుతున్నారు.  దీంతో నగదు కోసం బ్యాంకుల ముందు క్యూ కడుతున్నారు.

జిల్లాలోని సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్, నారాయణ్ ఖేడ్, జోగిపేట, పఠాన్ చెర్వు ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. దీంతో బ్యాంకు అధికారులు కలుగచేసుకుని ఏటీఎంలలో నగదు నిల్వలను ఉంచాలని కోరుతున్నారు జనం. బ్యాంకుల్లో సరిపడా డబ్బులను ఇవ్వాలంటున్నారు.

అదిలాబాద్ జిల్లాలో కూడా జనానికి  నగదు కొరత చుక్కలు చూపిస్తోంది.  ATMల దగ్గర నో క్యాష్ బోర్డులు పెట్టడంతో జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రిజర్వ్ బ్యాంకు నుంచి సరిపడా నగదు  జిల్లాకి రాకపోవడంతో తీవ్రమైన నగదు కొరత ఏర్పడింది. దీనికి తోడు పెళ్లిల్ల సీజన్ కూడా కావడంతో…జనం తీవ్రంగా అవస్థలు పడుతున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy