మళ్లీ బుల్లితెరపై బిగ్ బీ: త్వరలో KBC 9వ సీజన్

Amitabh-KBC-9కంప్యూటర్ జీ……లాక్ కియా జాయే…..అంటూ తన గంభీరమైన వాయిస్ తో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. టీవీషోలలో సంచలనం రేపిన కౌన్ బనేగా కరోడ్ పతి (KBC) 9 తో మరోసారి బుల్లితెర ప్రేక్షకులకు మెప్పించేందుకు సిద్ధమవుతున్నారు. KBC 9 షూటింగ్ ప్రారంభమైందని ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అమితాబ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

సరిగ్గా మూడేళ్ల తర్వాత కేబీసీ కార్యక్రమం తరిగి ప్రారంభం కానుంది. KBC 9 సెట్లో షూటింగ్ జరుగుతున్న ఫొటోలను అమితాబ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. కొన్ని సరికొత్త హంగులతో 9వ సీజన్ లో ప్రేక్షకులను అలరించబోతున్నారు నిర్వాహకులు.
షోలో పాల్గొనే వారికి సహాయంగా  తమకు నచ్చిన ఒక వ్యక్తిని  ఆడియన్స్ లో కూర్చోబెట్టవచ్చు. పార్టిసిపెంట్ కు ఆ జోడీదార్ ఒకసారి సాయం చేసే అవకాశముంటుంది. గతంలో ఉన్న ఫోన్ ఎ ఫ్రెండ్ ఆప్షన్ కు అదనపు హంగులు చేర్చారు. ఈ సారి పోన్ ఎ ఫ్రెండ్ ద్వరా పార్టిసిపెంట్లతో అవతలి వ్యక్తి  వీడియో కాల్ లో మాట్లాడవచ్చు. గతంలో కన్నా ఈ సీజన్ లో ప్రశ్నల సంఖ్య పెంచనున్నట్లు తెలుస్తోంది. తద్వారా అనవసర డ్రామాను తగ్గించాలని నిర్వాహకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సీజన్ లో పార్టిసిపెంట్లు కోటి రూపాయలు గెలుచుకున్నతర్వాత ఏడు కోట్లు గెలుచుకోవడానికి సంబంధించి ఒక జాక్ పాట్ ప్రశ్నను అడుగుతారు. ఆ సందర్భంలో ఎటువంటి లైఫ్ లైన్ లు పనిచేయవు. అంతేకాకుండా ఆ ప్రశ్నకు తప్పనిసరిగా సమాధానం చెప్పవలసి ఉంటుంది. ఒక వేళ  ఆన్సర్ చెప్పక పోతే ఒక నిర్ణీత మొత్తం మాత్రమే చెల్లిస్తారు. వారు గెలుచుకున్న కోటి రూపాయలను కోల్పోతారు. అయితే ఈ జాక్ పాట్ ప్రశ్న తీసుకోవాలా? వద్దా? అన్నది పార్టిసిపెంట్ల ఇష్టప్రకారమే ఉంటుంది.

KBC 9 కు రిజిస్ట్రేషన్లు జూన్ నెల నుంచి ప్రారంభమయ్యాయి. దాదాపు 2 కోట్ల మంది ఎంట్రీలు పంపినట్లు తెలుస్తోంది. సోనీ టీవీలో సెప్టెంబర్ రెండో వారం నుంచి ఈ షో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ సారి ఆరు వారాల పాటు కేవలం 30 ఎపిసోడ్లలో ఈ షో ప్రసారం కానుంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy