అమెరికాపై దాడి జరిగితే సోనీ టీవీలో చూస్తారు..!

trumpవివాదాస్పద వ్యాఖ్యల పరంపర ను కొనసాగిస్తూనే ఉన్నాడు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్. ఆఖరికి అమెరికా కు అత్యంత సన్నిహిత దేశాలను కూడా వదలకుండా విమర్శలు గుప్పిస్తున్నాడు. “ఒకవేళ అమెరికాపై దాడి జరిగితే జపాన్ జోక్యం చేసుకోదు.. జపనీయులు తాపీగా ఇంట్లో కూర్చుని సోనీ టీవీ చూస్తూంటారు. జపాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 9 ప్రకారం వారు ఇతర దేశాలకు సాయుధ బలగాలను పంపకూడదు. అదే జపాన్ పై ఎవరైనా దాడి చేస్తే అమెరికా వెళ్ళి కాపాడుతుంది.. మనం కుదుర్చుకున్న ఒప్పందాలు అలా ఏడ్చాయి. అమెరికా ఇలాంటి ఒప్పందాలను రద్దు చేసుకోవాలి…కనీసం రద్దు చేసుకుంటామని బెదిరించాలి” అని ట్రంప్ లోవాలో జరిగిన ఓ ర్యాలీలో అన్నాడు. నాటో దేశాల కూటమిలో ఆర్థిక వ్యవహారాలు దారుణంగా ఉన్నాయని, భారమంతా అమెరికా మీదే పడుతోందని ఆయనన్నారు.

జపాన్, దక్షిణ కొరియా, జర్మనీ, సౌదీ అరేబియా…ఈ దేశాలు ఒక్క పైసా కూడా విదల్చవు.. వారి సమస్యలైనా మనవిగా భావించాలి. ఇకపై ఇది కుదరదు.. ఆ దేశాలు డబ్బు పెట్టాల్సిందే. పరిస్థితులు మారాయి..ఇది నలభై ఏళ్ళ కిందటి స్థితి కాదు.. అని ట్రంప్ అన్నారు.

ఈ ఒక్క వారంలోనే ట్రంప్ చాలా అనుచిత వ్యాఖ్యలు చేశాడని, తన అవకాశాలను తానే దెబ్బ తీసుకుంటున్నాడని విశ్లేషకులు అంటున్నారు.. ముస్లిం యుద్ధవీరుడి కుటుంబాన్ని అవమానించడం, తన సభలో ఓ పాప ఏడ్చిందని ఆమెను, ఆమె తల్లిని బయటికి పొమ్మనడం, పాల్ రుయాన్ ను సీనియర్ మోస్ట్ రిపబ్లికన్ గా గుర్తించకపోవడం, విదేశాంగ విధానంపై విమర్శలు, ఇపుడు జపాన్ పై విమర్శలు… ఇవన్నీ ఆయన ఇమేజిని దెబ్బతీశాయని అంటున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy